Kantara: కాంతార ఓటీటీ రిలీజ్.. మళ్లీ వాయిదా..?

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి, కన్నడలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ, చిత్ర యూనిట్ ఊహించినదానికంటే ఎక్కువగా ఈ సినిమా రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి, కన్నడలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ, చిత్ర యూనిట్ ఊహించినదానికంటే ఎక్కువగా ఈ సినిమా రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

కాంతార మూవీ సబ్జెక్ట్ చాలా వైవిధ్యమైనది కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.300 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో రెడీ అవుతోంది. తొలుత ఈ సినిమాను గతంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని చూసిన అమెజాన్ ప్రైమ్‌ను కాంతార చిత్ర నిర్మాతలు రిక్వెస్ట్ చేసి, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను వాయిదా వేయించారు.

అయితే, ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్‌లో కాంతార చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం రెడీ అవుతుండగా, ఇప్పుడు మరోసారి దీన్ని వాయిదా వేయాలని కాంతార మేకర్స్ వారిని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇంకా ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుందని, ఇప్పుడే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తే, థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులు పూర్తిగా పొందలేకపోతారని చిత్ర నిర్మాతలు కోరారట. మరి అమెజాన్ ప్రైమ్ మరోసారి కాంతార చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేస్తుందా.. ఒకేవళ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తే, తిరిగి ఎప్పుడు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు