Virat Kohli : కోహ్లీపై కపిల్‌ దేవ్ షాకింగ్ కామెంట్స్.. జట్టులో విరాట్‌ను ఎందుకు తప్పించకూడదు..!

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Virat Kohli : కోహ్లీపై కపిల్‌ దేవ్ షాకింగ్ కామెంట్స్.. జట్టులో విరాట్‌ను ఎందుకు తప్పించకూడదు..!

Kapil Dev on Virat Kohli

Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫామ్ లేమితో సతమతమయ్యే విరాట్‌ను జట్టులో ఇంకా కొనసాగించడంపై కపిల్ దేవ్ తప్పుబట్టాడు. జట్టులో నుంచి కోహ్లీని ఎందుకు తప్పించకూడదని కపిల్ అభిప్రాయపడ్డాడు. ఇలానే కొనసాగిస్తే.. మిగతా ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టే అవుతుందని కపిల్ తెలిపాడు. ఎంత ఆటగాడైనా ఒకప్పటిలా ఆటతీరు లేని ఆటగాళ్లను ఎంతకాలం ఇలా కొనసాగించగలరనేది కపిల్ మాటల్లో తెలుస్తోంది. ఎన్నో సెంచరీలు బాదిన కోహ్లీ.. గత మూడేళ్లలో కనీసం మూడెంకల స్కోరును కూడా చేయలేకపోయాడు.

పేలవ ప్రదర్శనతో జట్టులో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. కోహ్లీ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. మాజీ ఆటగాళ్లు కోహ్లీకి రెస్టు ఇవ్వాలని లేదంటే జట్టు నుంచి తప్పించడమే సరైన నిర్ణయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కోహ్లీపై సంచలన కామెంట్స్ చేశాడు. ‘టెస్ట్‌ల్లో 450 వికెట్లు తీసిన అశ్విన్‌ను పక్కనపెట్టేశారు.. ఎంతో కాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్‌ను మాత్రం టీ20ల్లో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.

Kapil’s Sensational Comments On Kohli.. Why Not Drop Him From The Team (1)

Kapil’s Sensational Comments On Kohli.. Why Not Drop Him From The Team 

‘టీ20లలో కోహ్లీని బెంచ్‌కు పరిమితం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. వరల్డ్‌ నెం.2 బౌలర్ అశ్విన్‌ ఇంగ్లండ్‌‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు పక్కన పెట్టేశారు.. అలాంటప్పుడు ఒకప్పుడు నెంబర్ వన్ బ్యాటర్‌ కోహ్లీని కూడా టీ20 మ్యాచ్‌లకు దూరం పెట్టాలి కదా అని కపిల్ సూటిగా ప్రశ్నించాడు. ఒకప్పుడు ఆట ప్రదర్శనతోనే కోహ్లీ జట్టులో కొనసాగుతున్నాడు. అలాగే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు కూడా తగిన అవకాశాలు ఇవ్వకపోతే వారికి జట్టు యాజమాన్యం అన్యాయం చేస్తున్నట్టే అవుతుందని కపిల్ అభిప్రాయపడ్డాడు.

ఈ విషయంలో సెలెక్షన్‌ కమిటీ తప్పక ఆలోచించాలని కపిల్‌ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్‌ టెస్ట్‌లోనూ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులకే పరిమితమయ్యాడు. అప్పటినుంచి విరాట్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. కపిల్ వ్యాఖ్యలతో జట్టు యాజమాన్యం కోహ్లీని జట్టులో కొనసాగిస్తుందా లేదా పక్కన పెడుతుందా లేదో చూడాలి.

Read Also : Virat Kohli: విరాట్ చివరిగా సెంచరీ చేసిన సంగతి నాకైతే గుర్తు లేదు – సెహ్వాగ్