ఇంటిపేరు వల్లే హీరోయిన్‌గా ఎదిగావు.. కరీనాపై నెటిజన్ల ఆగ్రహం..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై కరీనా కపూర్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 08:56 AM IST
ఇంటిపేరు వల్లే హీరోయిన్‌గా ఎదిగావు.. కరీనాపై నెటిజన్ల ఆగ్రహం..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై కరీనా కపూర్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ కలచి వేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో సుశాంత్ మరణం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతులేని ప్రతిభ ఉన్నా పరిశ్రమలో పెద్దలుగా చలామణీ అవుతన్న వారి చేత అణచివేతకు గురికావడంతోనే అతను ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు, బాలీవుడ్‌లో బంధుప్రీతి చాలా ఎక్కువ, కొత్త వారిని తొక్కేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ ప్రముఖులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సోషల్ మీడియా మాధ్యమాల్లో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరీనా కపూర్ ఖాన్ గతంలో సుశాంత్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెతికిమరీ ఓ ఆట ఆడుకుంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే.. గతంలో కరీనా కపూర్, సారా అలీఖాన్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైంది. ఆ షోలో కరీనా.. సుశాంత్ గురించి వెకిలిగా మాట్లాడింది. ‘సారాకు నువ్వు ఇచ్చే డేటింగ్ టిప్ ఏంటి?’ అని గతంలో సారా అలీఖాన్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన కరీనా.. సుశాంత్ గురించి వెకిలిగా మాట్లాడింది. `సారాకు నువ్వు ఇచ్చే డేటింగ్ టిప్ ఏంటి?` అని వ్యాఖ్యాత కరీనాను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కరీనా.. ‘చెత్త మొహంతో ఉండే నీ మొదటి సినిమా హీరోతో మాత్రం డేట్‌కు వెళ్లకు’ అని సారాతో చెప్పింది.

సారా మొదటి సినిమా ‘కేదార్‌నాథ్’లో సుశాంత్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కరీనాను వివపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.‘ కరీనా నీకు చాలా పొగరెక్కువ. నీకు ఎలాంటి టాలెంట్ లేదు. కేవలం కపూర్ అనే ఇంటి పేరు వల్లే నువ్వు హీరోయిన్‌గా ఎదిగావు’, ‘నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది’, ‘బాయ్‌కాట్ కరీనా కపూర్’ అంటూ నెటిజన్లు కరీనాపై విరుచుకుపడుతున్నారు.

Read:  సుశాంత్ అకాల మరణం.. మరో అభిమాని ఆత్మహత్య..