Karimnagar CP : ప్రివిలేజ్ కమిటీ ఎదుట కరీంనగర్ సీపీ, విచారణకు దూరంగా ఉన్న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు

ఫిబ్రవరి 5 తేదీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉండడంతో తమకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పోలీసుల...

Karimnagar CP : ప్రివిలేజ్ కమిటీ ఎదుట కరీంనగర్ సీపీ, విచారణకు దూరంగా ఉన్న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు

Bandi

Lok Sabha Privileges Committee : ప్రివిలేజ్ కమిటీ ఎదుట కరీంనగర్ సీపీ, విచారణకు దూరంగా ఉన్న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు  లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ కరీంనగర్ సీపీ సత్యనారాయణ, పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై మధ్యాహ్నం 3 గంటలకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు పోలీస్ అధికారులు.  అయితే.. ఈ విచారణకు సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు దూరంగా ఉన్నారు. ఫిబ్రవరి 5 తేదీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉండడంతో తమకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పోలీసుల వ్యవహరించిన తీరుపై గత నెల 21న తెలంగాణ సీఎస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్ స్పెక్టర్ లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read More : India Covid Cases : దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.72 లక్షల కేసులు, 1,008 మరణాలు

కరీంనగర్ లో తన కార్యాలయంలో దీక్ష సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని ప్రివిలేజ్ కమిటీ కి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. జనవరి 21న ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై తనపై దాడికి సంబందించిన సాక్ష్యాలు, తన కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకు రావడం, గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసిన వీడియోలను ప్రివిలేజ్ కమిటీకి సమర్పించారు. తనపై దాడి చేసి అక్రమంగా అరెస్టు చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో సహా బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిటీని కోరారు. 317 జీవో మూలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ‘స్థానికత’ను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని గతంలో దీక్ష చేశారు. ఉద్యోగుల కేటాయింపులో పారదర్శకత పాటించలేదని, ఒక్కో జిల్లాలో ఒక్కో పద్దతిని ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇష్టారాజ్యంగా బదిలీ చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో, దానివల్ల ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని బండి సంజయ్ వివరించారు.