Karnataka: పట్టాల‌పై ట్ర‌క్కు.. ఢీకొట్టిన రైలు.. వీడియో

పట్టాల‌పై ఉన్న ఓ ట్ర‌క్కును రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ జిల్లాలోని సిద్ధేశ్వ‌ర్ రైల్వే క్రాసింగ్ బాల్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఇవాళ ఉద‌యం ఓ ట్ర‌క్కు ప‌లు సామ‌గ్రితో వెళ్తుంది. ట్రాక్ దాటుతోన్న‌ స‌మ‌యంలో ఆ ట్ర‌క్కులో యాంత్రిక స‌మ‌స్య త‌లెత్తి దాని వెనుక‌భాగం మొత్తం ప‌ట్టాల‌పైనే నిలిచిపోయింది.

Karnataka: పట్టాల‌పై ట్ర‌క్కు.. ఢీకొట్టిన రైలు.. వీడియో

Accident

Karnataka: పట్టాల‌పై ఉన్న ఓ ట్ర‌క్కును రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ జిల్లాలోని సిద్ధేశ్వ‌ర్ రైల్వే క్రాసింగ్ బాల్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఇవాళ ఉద‌యం ఓ ట్ర‌క్కు ప‌లు సామ‌గ్రితో వెళ్తుంది. ట్రాక్ దాటుతోన్న‌ స‌మ‌యంలో ఆ ట్ర‌క్కులో స‌మ‌స్య త‌లెత్తి దాని వెనుక‌భాగం మొత్తం ప‌ట్టాల‌పైనే నిలిచిపోయింది. ముందుకు వెళ్ళ‌లేక అక్క‌డే ఉండిపోవ‌డంతో ఈ విష‌యాన్ని అక్క‌డి రైల్వే సిబ్బంది గ‌మ‌నించారు. రైలు ఆగడానికి సిగ్న‌ల్ ఇచ్చారు.

Maharashtra: మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద భారీగా నిలిచిన‌ వ‌ర్ష‌పు నీరు

అయితే, అప్ప‌టికే ఆ రైలు ట్ర‌క్కుకు ద‌గ్గ‌ర‌గా రావ‌డంతో అది ఆగ‌లేదు. మెల్లిగా ముందుకు వ‌చ్చి ట్ర‌క్కును ఢీ కొట్టిన త‌ర్వాత ఆగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ ట్ర‌క్కులో ఉన్న సామ‌గ్రి అంతా ధ్వంస‌మైపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ రైల్వే క్రాసింగ్‌ల వ‌ద్ద ఇటువంటి ఘ‌ట‌న‌లు త‌రుచూ చోటు చేసుకుంటున్నాయి.