చిన్నారిపై 17మంది అత్యాచారం..రేపిస్టుల దగ్గర డబ్బులు తీసుకుని..బాలికకు నరకం చూపించిన అత్త

చిన్నారిపై 17మంది అత్యాచారం..రేపిస్టుల దగ్గర డబ్బులు తీసుకుని..బాలికకు నరకం చూపించిన అత్త

Karnataka 17 people rape over 15 years girlకర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 15 ఏళ్ల బాలికను వ్యభిచార కూపంలోకి నెట్టి సొమ్ము చేసుకుంటున్న బాలిక అత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మని నమ్మిన అత్తే ఆ 15ఏళ్ల అమాయకురాలికి నరకం చూపెట్టింది. ఐదు నెలల్లో ఆ బాలికపై 17 మంది లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. వీరిలో.. 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారికి విచారిస్తుండగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

15ఏళ్ల బాలికకు మూడేళ్ల క్రితం తల్లి చనిపోయింది. దీంతో ఆదుకునేవారు లేక విద్య అనే అత్త దగ్గరే ఉంటోంది. అలా ఉంటున్న ఆ బాలిక స్టోన్ క్రషింగ్ కంపెనీలో పనికి వెళ్లేది. అలా పనిలోకి వెళ్తున్న ఆమెపై ఓ బస్ డ్రైవర్ కన్నుపడింది. అదను చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్నంతా సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ బాలికపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ఆ బస్ డ్రైవరే కాకుండా అతని స్నేహితులకు బాలికను అప్పగించాడు. ఈక్రమంలో బాలికకు డ్రైవర్ గిరీష్ గర్భం రాకుండా ట్యాబ్లెట్స్ వేశాడు. అలా మొత్తం 17మంది ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ విషయం అంతా బాలిక అత్తకు తెలిసే జరుగుతోంది. అత్యాచారానికి పాల్పడివారి నుంచి అత్త చిక్కమ్మ డబ్బు తీసుకున్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది. అత్త డబ్బుల దాహానికి..కామాంధులు కామదాహానికి ఆ చిన్నారి బలైపోయింది. బాలికపై గత ఐదు నెలలుగా జరుగుతున్న ఈ దారుణాన్ని చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సుబ్రమణ్య జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం బాలిక భయపడి బయటకు చెప్పకపోవటంతో అత్తకు కాసుల వర్షం కురిసింది. కామాంధుల దురాగతం కొనసాగింది. అలా దాదాపు ఐదు నెలలుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి విముక్తి లభించింది.

దీనిపై జిల్లా ఎస్పీ హకే అక్షయ్ మచింద్ర మాట్లాడుతూ..బాలికను పోలీసులు వైద్య పరీక్షలకు పంపించగా 17మంది అత్యాచారం చేసినట్లుగా తెలిసిందని..నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కేసును దర్యాప్తును కొనసాగిస్తున్నామని తెలిపారు.

డబ్బుకు కక్కుర్తి పడే తాను బాలికతో వ్యభిచారం చేయించినట్లు ఆమె అత్త అంగీకరించింది. తల్లి చనిపోవడంతో తోడు కోల్పోయిన బాలికను కంటికి రెప్పలా కాపాడాల్సిన అత్తే ఇలాంటి పనులకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో డ్రైవర్ గిరీష్ తో పాటు 8మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం నిందితులు గిరీష్, స్మాల్ అభి, వికాస్,మణికంఠ, సంపత్, అశ్వత్ గౌడ, రాజేష్, అమిత్, సంతోష్, దీక్షిత్,నిరంజన్, నారాయణ గౌడ, అభి గౌడ, యోగేష్, అత్త విద్యలు నిందితులుగా ఉన్నారు.