న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం, షేక్ హ్యాండ్, కౌగిలింతలు వద్దు

న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం, షేక్ హ్యాండ్, కౌగిలింతలు వద్దు

Karnataka bans New Year : నూతన సంవత్సరం వచ్చేస్తోంది. గత కొద్ది రోజుల్లో 2020కు బై చెప్పి…2021కు వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. డిసెంబర్ 31వ తేదీన పార్టీలు చేసుకోవడానికి సిద్ధమౌతున్నారు జనాలు. కానీ..కరోనా భయం వెంటాడుతోంది. ఈ వైరస్ పండుగలు, వేడుకలు, శుభాకార్యాలపై ప్రభావం చూపెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో పలు రాష్ట్రాలు నూతన సంవత్సర సెలబ్రేషన్స్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్నాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం వల్ల…ఫస్ట్ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇధి అమలవుతుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 02వ తేదీ వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. ప్రజల ఆరోగ్యం మేలు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజలు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, షేక్ హ్యాండ్స్, కౌగింతలు వద్దని సూచించింది. పబ్లిక్ ప్లేస్‌లు, షాపింగ్ మాల్స్, ఇతరత్రా ప్రదేశాల్లో ప్రజలు గుమికూడే అవకాశం ఉందని వెల్లడించింది. క్లబ్‌లు, రెస్టారెంట్‌లు, పబ్‌ల్లో కూడా ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.