Omicron fear : కర్ణాటకలో కరోనా.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతు కలవరం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా ..క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించే దిశగా యోచిస్తోంది.

Omicron fear : కర్ణాటకలో కరోనా.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు

Covid 19 Restrictions For New Year And Christmas Celebrations

Omicron fear  In Karnataka : కరోనా తగ్గిందని సంతోషించేలోపే ఒమిక్రాన్ వేరియంట్ గా మారి భయపెడుతోంది. అలాగే క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇప్పటికే భారత్ లోకి కూడా ఒమిక్రాన్ ఎంటర్ అయ్యింది. ఇప్పటికే 46 దేశాలు చుట్టేసింది. అలాగే కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో వేడుకల సంతోషంలో మునిగిపోవటం కాదు ఓ కంట కరోనాను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది.కరోనా కేసుల పెరుగుదలలో భాగంగా కర్ణాటకలోని 16 జిల్లాల్లో డిసెంబర్‌ మొదటి వారంలోనే కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 500 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడడంతో అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. కేసుల ఉధృతి కొనసాగితే కిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించే యోచనలో ఉన్నారు ఆరోగ్యశాఖ అధికారులు.

Read more : No Vaccine No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..లేదంటే ఇచ్చేదే లేదు : TSCAB

కరోనా కేసులు తగ్గాయి కదాని రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కానీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరోసారి అప్రమత్తమవుతోంది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించారు. హవేరి, కొడగు, చిక్కబళ్లాపుర, మైసూరు, మాండ్య, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇటువంటి సమయంలో ఆంక్షలు ఎత్తివేస్తే కేసులు మరింతగా పెరిగే అవకాశమందని కాబట్టి ఆంక్షలు కొనసాగించాలని అనుకుంటోంది. పరిస్థితి అదుపులో ఉన్న ప్రతి జిల్లాలోనూ నాలుగు రెట్లు కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమవుతున్నారు అధికారులు.

Read more : Shocking news : 2021 డిసెంబర్‌ 25న మహాద్భుతం జరుగుతుందట..!మనుషుల జీవితాలే మారిపోతాయట..!!

నవంబర్ 26 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ మధ్య 2వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 1,800 వరకు కేసులు రికార్డయ్యాయి. అలాగే గత 15 రోజుల్లో 25శాతం కేసులు పెరిగాయి. శివమొగ్గ, కొప్పల్‌ జిల్లాల్లో కేసుల పెరుగుదల నాలుగు శాతం నమోదైంది. ఇదిలా ఉండగా.. పలు వేడుకలపై ఆంక్షలు విధించే దిశగా ప్లాన్ రెడీ చేస్తున్నారు అధికారులు. పెరుగుతున్న కేసుల్ని దృష్టిలో పెట్టుకుని నియంత్రించటానికి పరిస్థితిని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. కాగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.