IPS రూప..20 ఏళ్లలో 40 సార్లు ట్రాన్స్ ఫర్..అయినా ఒత్తిడులకు తలొగ్గేది లేదంటున్న ధీర

IPS రూప..20 ఏళ్లలో 40 సార్లు ట్రాన్స్ ఫర్..అయినా ఒత్తిడులకు తలొగ్గేది లేదంటున్న ధీర

Karnataka ips d.roopa over 40 times in 20 yrs : IPS అధికారి D.రూప మౌడ్గిల్ తన డ్యూటీలో ఏమాత్రం రాజీ పడరు. తప్పు చేస్తే ఎంతటి వారని కూడా చూడరు. ప్రశ్నిస్తారు. ఆరోపణలు చేస్తారు. తప్పు చేసినవారిపై యాక్షన్ తీసుకోవటానికి కూడా వెనుకాడని ధైర్యం..ఆత్మస్థైర్యం ఆమె సొంతం. దీంతో ఆమె తన 20 ఏళ్ల కెరీర్ లో తన సర్వీసు ఏళ్లకు మించి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అంటే తన 20 ఏళ్ల కెరీర్ లో 40సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యారు. అయినా తన డ్యూటీలో ఏమాత్రం రాజీ పడకుండా నిజాయితీగా ఉండటం IPS రూప ప్రత్యేకత.

కర్ణాటక హోం సెక్రటరీగా పనిచేస్తున్న IPS రూప ప్రస్తుతం బెంగళూరు సేఫ్ సిటీ ప్రాజెక్టుకు చెందిన టెండర్ ప్రక్రియలో చోటు చేసుకున్న కోట్లది రూపాయల కుంభకోణంలో తన పైఅధికారి హేమంత్ నింబల్‌కర్‌పై ఆరోపణలు చేశారు. దీని ఫలితంగా ఆమె హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంనకు బదిలీ చేయబడ్డారు. కానీ తాను చేసిన ఆరోపణలపై కచ్చితంగా నిలబడ్డారామె. తన చేసిన ఆరోపణల్లో టెండరింగ్ కమిటీ చీఫ్ అయిన నింబల్‌కర్ నిబంధనలు ఉల్లంఘించి, ఒక ప్రమఖ కమిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

అయితే దీనిపై నింబల్ కర్ స్పందిస్తూ..తనమీద ఆరోపణలు చేయటానికి ఆమె ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఎటువంటి అధికారంతో రూప ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.కానీ రూపమాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) తనకు అధికారం కల్పించారని..రూప నొక్కి వక్కాణిస్తున్నారు. కాగా డీ రూప కర్ణాటక హోం సెక్రటరీ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళగా డీ రూప నిలవటం గమనించాల్సిన విషయం.

తన డ్యూటీలో తాను చేసిన విధులకు గానీ తనకు మరోమారు ట్రాన్స్ ఫర్ అయిన క్రమంలో డీ రూప ఒక ట్వీట్‌లో స్పందించారు. బదిలీ చేయడమనేది ప్రభుత్వ ఉద్యోగంలో భాగమని..తన కెరియర్‌ కన్నా రెండింతలుగా తనను బదిలీ చేశారని రూప ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎన్ని ట్రాన్స్ ఫర్లు అయినా సరే తన వ్యక్తిత్వంలో ఎటువంటి మచ్చలేదని..కానీ ఎన్ని ఒత్తిడులు వచ్చినా నా డ్యూటీలో నేను ఏమాత్రం రాజీ పడనని ఆత్మస్థైర్యంతో తెలిపారు.

చాలామంది అధికారులు తాము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వారు ఏ విషయాన్నీ చర్చించరు. అయితే తాను అలా ఉండలేనని, విధి నిర్వహణలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని..అటువంటి నిర్ణయాలు ఎంత కఠినమైనవైనా సరే తీసుకోవటానికి ఏమాత్రం వెనుకాడనని తెలిపారు. తప్పు చేయకపోవటం నా వ్యక్తిగతం..ఆ వ్యక్తిత్వాన్ని నేను ఎన్నిటికి విడిచిపెట్టనని తెలిపారు.

కాగా మూడేళ్ల క్రితం డీ రూప పేరు వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో తమిళనాడు మాజీ సీఎం..దివంగత జయలలిత సన్నిహితురాలు అయిన శశికళపై పలు ఆరోపణలు చేశారు. కర్నాటక జైలులో అధికారులతో పాటు రూప కూడా తనిఖీలు నిర్వహించారు. ఇది వివాదాస్పదమైన నేపధ్యంలో డీ రూపపై రూ. 10 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం కేసు వేశారు.

Karnataka ips d Roopa

రూప్ 2000వ సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆమె 2016, 2017లలో పోలీసు విభాగంలో అందించే రాష్ట్రపతి పురస్కారాలను కూడా అందుకున్నారు. తన 20 ఏళ్ల కెరియర్‌లో 40 సార్లు బదిలీ అయ్యారు.