Priyank Kharge: లంచం లేదంటే మంచం.. కాంగ్రెస్ నేత ఖర్గే కుమారుడి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు దేశం కోసం ఎంతో కష్ట పడుతున్నారని, వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యానించిన ప్రియాంక్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Priyank Kharge: లంచం లేదంటే మంచం.. కాంగ్రెస్ నేత ఖర్గే కుమారుడి వివాదాస్పద వ్యాఖ్యలు

karnataka former minister Priyank Kharge sparks controversy

Priyank Kharge: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్ణాటకలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ‘ఉద్యోగాలు పొందాలంటే అబ్బాయిలు లంచం ఇవ్వాలి, అమ్మాయిలు అయితే మరో రకంగా సహకరించాలి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో అవినీతి జరుగుతోందని విమర్శలు చేస్తున్న క్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘‘సీఎం అంటే కామన్ మ్యాన్ అని బొమ్మై ప్రకటించుకున్నారు. కానీ కామన్ మ్యాన్‭ కష్టాల్ని తుడవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలే చూసుకుంటే, తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై నియామకాల్లో మూడు లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అబ్బాయిలు అయితే లంచం ఇవ్వాల్సి వస్తోంది. అదే అమ్మాయిలపై మరో రకమైన ఒత్తిడి వస్తోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని లంచం-మంచం ప్రభుత్వం అనేందుకు పెద్దగా ఆలోచించను’’ అని ప్రియాంక్ అన్నారు.

కాగా, ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు దేశం కోసం ఎంతో కష్ట పడుతున్నారని, వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యానించిన ప్రియాంక్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Shah Faesal: రాజకీయాలకు గుడ్ బై.. మళ్లీ సివిల్ సర్వీసులో చేరిన యూపీఎస్‭సీ టాపర్