Online Class on Roadside: కూతురి ఆన్‌లైన్ క్లాస్ కోసం వర్షంలో గొడుగుతో నాన్న

కూతురు ఆన్‌లైన్ క్లాస్ మిస్ కాకూడదని వర్షం పడుతున్నా గొడుగు పట్టుకుని నిల్చొని డిస్టర్బ్ కాకుండా చూశాడు ఆ తండ్రి. మారుమూల పల్లెప్రాంతంలో నివాసముంటున్నా చదువుకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నాడు.

Online Class on Roadside: కూతురి ఆన్‌లైన్ క్లాస్ కోసం వర్షంలో గొడుగుతో నాన్న

Ftahert Daughter

Online Class on Roadside: కూతురు ఆన్‌లైన్ క్లాస్ మిస్ కాకూడదని వర్షం పడుతున్నా గొడుగు పట్టుకుని నిల్చొని డిస్టర్బ్ కాకుండా చూశాడు ఆ తండ్రి. మారుమూల పల్లెప్రాంతంలో నివాసముంటున్నా చదువుకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన సుల్లియా తాలూకాకు చెందిన బల్లాకలో ఈ ఘటన జరిగింది.

నెట్టింటే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి మనసుల్ని గెలుచుకుంటున్న ఈ ఫొటోలో భారీగా వర్షం పడుతుండగా రోడ్ పక్కనే ఓ స్టూడెంట్ కూర్చొని ఫోన్ పట్టుకుని ఉంది. ఆమె తండ్రి నారాయణ గొడుగుతో ఎస్ఎస్ఎల్సీ ఆన్ లైన్ క్లాసుకు అటెండ్ అవుతున్న కూతురికి ఆసరాగా నిల్చొన్నాడు.

ఆ క్లాస్ వినడం కోసం రోజూ సాయంత్రం 4గంటలకు వారిద్దరూ వస్తారట. దక్షిణ కన్నడ గ్రామీణ వాతావరణంలో ఇంటర్నెట్ ఫెసిలిటీ తక్కువగా ఉండటంతో ఇలా దూరంగా రావాల్సిన పరిస్థితి.

‘వాళ్లకు ఇది డైలీ రొటీన్ గా జరుగుతుంది. ఎంత వర్షం పడుతున్నా… తండ్రి కూతురు అటెండ్ అవడం కోసం గొడుగు పట్టుకుని నిల్చొన్నాడు. మంచి నెట్ వర్క్ లేకపోతే అలాంటి స్టూడెంట్లకు పెద్ద సమస్యే’అని లోకల్ రిపోర్టర్ అంటున్నారు.

గట్టిగర్, బల్లాక, కమిలా ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా ఇంటర్నెట్ కావాలంటే ఊరి దాటి రావాల్సిందే. వారంతా కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మీదనే ఆధారపడి ఉంటున్నారు. పవర్ కట్ అయిందంటే మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది. అదింకా పెద్ద సమస్య. ఇక అందీ అందని సిగ్నల్ తో 3G నెట్ వర్క్ తో ఆన్ లైన్ క్లాసులకు హాజరువుతున్నారు అక్కడి వారంతా.