Cops saffron dress : కాషాయ వస్త్రాలు ధరించిన కర్ణాటక పోలీసులు..సీఎం రాజీనామా చేయాలని డిమాండ్

కర్ణాటక పోలీసులు కాషాయ వస్త్రాలు ధరించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతు.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాకీలు కాషాయ వస్త్రాలు ధరించటం పలువివాదాలకు దారి తీస్తోంది

Cops saffron dress : కాషాయ వస్త్రాలు ధరించిన కర్ణాటక పోలీసులు..సీఎం రాజీనామా చేయాలని డిమాండ్

Karnataka  Police In Saffron Drees

karnataka  police in saffron dress : ఖాకీ బట్టలు వేసుకోవాల్సిన పోలీసులు కాషాయ బట్టలు కట్టుకుంటే ఎలా ఉంటుంది? కర్ణాటకలో అదే జరిగింది. కాషాయ వస్త్రాలు అంటే మనకు ఠక్కున బీజేపీయే గుర్తుకొస్తుంది.మరి కర్ణాటకలో బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పోలీసులకు ఖాకీ బట్టలు కాకుండా కాషాయ వస్త్రాలు వేసుకోవటం ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. ప్రతిపక్ష పార్టీ నేతలు దీనిపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. పోలీసులు కాషాయ వస్త్రాలు ధరించటం..ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అదికాస్తా రాజకీయ తుపాన్ రాజుకునేలా చేసింది. ఇంతకీ పోలీసులు కాషాయ వస్త్రాలు ఎందుకు ధరించారు? అంటే..

Read more : Indian-Origin Teen: ఆస్ట్రేలియాపై న్యాయపోరాటానికి దిగిన భారత సంతతి టీనేజర్

విజయదశమి పండుగ సందర్భంగా కర్ణాటకలోని విజయపుర, ఉడిపి పోలీసులు అధికారులతో సహా అందరు కాషాయ వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విట్టరులో పెట్టారు. దీంతో కర్ణాటక బీజేపీ రాష్ట్రాన్ని ఉత్తర‌ప్రదేశ్ లాంటి జంగిల్‌రాజ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. పలు విమర్శలకు చేసింది. విజయదశమి సందర్భంగా అక్టోబరు 14వతేదీన విజయపుర ఎస్పీ సహా పోలీసులు కాషాయ షర్టు, తెల్లని లుంగీలు ధరించి మెడలో కాషాయ కండువాలు వేసుకున్నారు. ఉడిపిలోని కౌప్ పోలీసుస్టేషనులో మగ పోలీసులు కాషాయచొక్కాలు, తెల్లటి ధోతిలు ధరించగా మహిళా పోలీసులు కూడా కాషాయ రంగు చీరలు ధరించి ఫొటోల్లో కనిపించారు. దీంతో కాంగ్రెస్ మండిపడుతోంది.

కర్ణాటకను ఉత్తర ప్రదేశ్ లాంటి జంగిల్ రాజ్ గా మార్చడానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య మండిపడ్డారు.ఖాకీలు వేసుకోవాల్సిన పోలీసులు కాషాయ కట్టటం ఏంటీ అంటూ ప్రశ్నించారు.కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అంతేకాకుండా పలు విమర్శలతో ఎద్దేవా చేశారు. ‘బీజేపీ ప్రభుత్వం పోలీసుల యూనిఫామ్‌లను మాత్రమే ఎందుకు మార్చారు? మిస్టర్ బొమ్మాయ్.. వారికి త్రిశూలం ఇచ్చి హింసాకాండకు పర్మిషన్ కూడా ఇవ్వండి. జంగిల్ రాజ్ స్థాపించాలనే మీ కల పూర్తి అవుతుంది’’అని సిద్దరామయ్య ఫైర్ అయ్యారు.

Read more : Railway Police : ప్రాణాలకు తెగించి గర్భిణీని కాపాడిన కానిస్టేబుల్

దీనిపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతు.. ‘‘పోలీసు బలగాలు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలి, కాని రాజకీయంగా కాషాయరంగు దుస్తులు వేసుకుని పైగా వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటూ డీకే శివకుమార్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ఘటనపై పశ్నించారు. పలు విమర్శలుగుప్పించారు.