Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం

చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు.

Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం

Karthi Chidambaram

Karthi Chidambaram : మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. చైనీస్ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు విచారించనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలపై కార్తీ చిదంబరం సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సీబీఐ సమన్లు జారీ చేసింది.

చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు కార్తీ చిదంబరం హాజరు కానున్నట్లు సమాచారం.

Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు

కార్తీ చిదంబరం మధ్యాహ్నం 2 నుంచి 4గంటల సమయంలో సీబీఐ విచారణకు రావచ్చని తెలుస్తోంది. ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారని సీబీఐ అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని… కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని న్యాయవాదికి చెప్పి పంపినట్లు వెల్లడించారు.

కార్తీ చిదంబరం న్యాయవాదులు ఇచ్చిన సమాచారం మేరకు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్‌ కేసు ఈడీ నమోదు చేసింది. 263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో… సీబీఐ కేసు ఆధారంగా ఈడీ..మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.