Sardar: వంద కోట్ల సర్దార్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..!

తమిళ యంగ్ హీరో కార్తీ నటించిన రీసెంట్ మూవీ ‘సర్దార్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు పిఎస్.మిత్రన్ ఈ సినిమాను వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కించగా, ఈ సినిమాలో కార్తీ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు.

Sardar: వంద కోట్ల సర్దార్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..!

Karthi Sardar Movie Locks OTT Release Date

Sardar: తమిళ యంగ్ హీరో కార్తీ నటించిన రీసెంట్ మూవీ ‘సర్దార్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు పిఎస్.మిత్రన్ ఈ సినిమాను వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కించగా, ఈ సినిమాలో కార్తీ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కార్తీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాకు తెలుగునాట అనుకున్న మేర రిజల్ట్ రాలేదు.

Sardar 2 : సర్దార్ 2ని అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు.. ఈసారి కంబోడియాలో..

కానీ, తమిళనాట మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించిన ఈ సినిమా కార్తీ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ సినిమాను నవంబర్ 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తోందట. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ఆహా సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Sardar: కార్తి సర్దార్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

అయితే, సర్దార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ తాజాగా వచ్చింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, రజీషా విజయన్, లైలా, సిమ్రాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, జి.వి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.