Kashmir Files : గోవా ఫిలిం ఫెస్టివల్ వేదికపై కశ్మీర్ ఫైల్స్ వివాదం.. IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్ పై దేశవ్యాప్తంగా విమర్శలు..

తాజాగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై మరోసారి కశ్మీర్ ఫైల్స్ వివాదం మొదలైంది. IFFI జ్యురి హెడ్ నదవ్ లాపిద్ మాట్లాడుతూ వేదికపై ఈ సినిమా మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. నవాద్ మాట్లాడుతూ...................

Kashmir Files : గోవా ఫిలిం ఫెస్టివల్ వేదికపై కశ్మీర్ ఫైల్స్ వివాదం.. IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్ పై దేశవ్యాప్తంగా విమర్శలు..

Kashmir Files issue in 53rd IFFI goes viral

Kashmir Files :  గోవాలో ఘనంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ వేదికపై వివాదం రాజుకుంది. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా పలు సినిమాలని సెలెక్ట్ చేశారు. వాటిల్లో కశ్మీర్ ఫైల్స్ కూడా ఉంది. కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణ కాండని కళ్ళకి కట్టినట్టు చూపించి చిన్న సినిమాగా రిలీజయి పెద్ద హిట్ కొట్టింది కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. పలు అవార్డులని కూడా అందుకుంది కశ్మీర్ ఫైల్స్.

కానీ ఈ సినిమాకి కొన్ని వివాదాలు కూడా చుట్టు ముట్టాయి. ఒక వర్గాన్ని తప్పుగా చూపించారంటూ పలువురు ఈ సినిమాపై నెగిటివ్ విమర్శలు చేశారు. అయితే ఈ సినిమాని ఎంతమంది విమర్శించినా నిజాలు నిర్భయంగా చెప్పడంతో ప్రజాదారణ లభించింది. తాజాగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై మరోసారి కశ్మీర్ ఫైల్స్ వివాదం మొదలైంది.

IFFI జ్యురి హెడ్ నదవ్ లాపిద్ మాట్లాడుతూ వేదికపై ఈ సినిమా మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. నవాద్ మాట్లాడుతూ.. ”ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి చూసి మేము ఖంగుతిన్నాము. ఇది ఒక వల్గర్ కంటెంట్ తో రాజకీయ ఉద్దేశంతో తెరకెక్కిన సినిమాలా ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్ చూపించినవన్నీ అవాస్తవం అని అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి ఒక అంతర్జాతీయ వేదికపై అటువంటి సినిమాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది” అనీ అన్నారు. దీంతో నదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి.

ఇక కశ్మీర్ ఫైల్స్ సినిమా అభిమానులు, హిందువులు, కశ్మీర్ పండిట్స్, పలువురు సెలబ్రిటీలు.. నవాద్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ దీనిపై స్పందిస్తూ.. ”1990లో కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దురాగతాలను ఈ సినిమా ప్రపంచానికి తెలియజేసింది. ఇది పూర్తిగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన సినిమా. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులైన దాదాపు 500 మంది కశ్మీర్ పండిట్స్ ని కలిసి, ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలని తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించాడు. 1990 జనవరి 19న ఏకంగా 5 లక్షల మంది కశ్మీర్ పండిట్స్ తమ ఇళ్ళని వదిలి పారిపోయారు. అందులో నేను కూడా ఒకడ్ని” అని తెలిపారు.

Raviteja : డ్యాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ కి మాస్ మహారాజ్.. అదిరిపోయిన ఎంట్రీ..

అనుపమ్ ఖేర్ తో పాటు పలువురు ప్రముఖులు, బీజేపీ నాయకులు కూడా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి IFFI జ్యూరీ హెడ్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నారు. ఇలా ఒక పెద్ద వేదికపై సినిమా యూనిట్ ని పిలిచి సినిమా గురించి తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని నదవ్ కి నెటిజన్లు కూడా క్లాస్ పీకుతున్నారు. మరోసారి కశ్మీర్ ఫైల్స్ పై చెలరేగిన వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.