Bihar : ‘కశ్మీర్ ప్రత్యేక దేశం’ అని పేర్కొన్న బీహార్ విద్యాశాఖ .. ప్రశ్నాపత్రం చూసి విద్యార్ధులు షాక్

‘కశ్మీర్ ప్రత్యేక దేశం’ అంటూ పేర్కొంది బీహార్ విద్యాశాఖ..దీంతో బీజేపీ నేతలు తెగ మండిపడిపోతున్నారు.

Bihar : ‘కశ్మీర్ ప్రత్యేక దేశం’ అని పేర్కొన్న బీహార్ విద్యాశాఖ .. ప్రశ్నాపత్రం చూసి విద్యార్ధులు షాక్

Kashmir Referred To As Separate Country In Bihar Class 7 Question Paper

Bihar : కశ్మీర్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదం. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కానీ కశ్మీర్ మాత్రం ఓ ప్రత్యేక దేశం అంటోంది బీహార్ విద్యాశాఖ. అదేంటీ కశ్మీర్ ప్రత్యేక దేశమా? ఇదెక్కడి చోద్యం అనే డౌట్ వస్తుంది కదూ. కశ్మీర్ ఓ దేశం అని స్కూల్ పిల్లలకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో పేర్కొంది బీహార్ విద్యాశాఖ. పరీక్షల్లో అది చూసిన విద్యార్ధులు సైతం షాక్ అయ్యారు. కశ్మీర్ ఓ దేశం అంటూ ప్రశ్నాపత్రంలో పేర్కొనటంపై బీహార్ లో వివాదం నెలకొంది. అదను దొరికితే చాలు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు సంధించటానికి రెడీగా ఉన్న బీజేపీ దీనిపై విమర్శలు చేస్తోంది. కశ్మీర్ ను మనదేశంలోని భూభాగంగా గుర్తించట్లేదా? అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ప్రశ్నాపత్రంలో వచ్చిన ఈ పొరపాటు గురించి స్కూల్ హెడ్ మాస్టారు మాట్లాడుతూ..ఈ ప్రశ్నాపత్రం రాష్ట్ర విద్యాశాఖ నుంచే వచ్చిందని..పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే, నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీ జనతాదళ్(యునైటెడ్) లు కశ్మీర్ ను మనదేశంలోని భూభాగంగా గుర్తించట్లేదా? అంటూ బీజేపీ నేతలు మండిపడిపోతున్నారు.

బీహార్ లోని ఓ స్కూల్ లో 7th పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రంలో వివిధ దేశాలు, అక్కడ నివసించే ప్రజలను ఏమంటారో చెప్పాలంటూ రెండు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చైనా, నేపాల్, ఇంగ్లాండ్, ఇండియాలతో పాటు కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నారు. కశ్మీర్ దేశస్తులను ఏమంటారని ప్రశ్న కనిపించడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. ఈ విషయం బయటకు రావటంతో బీజేపీ నేతలు నితీశ్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ ఆరోపణలపై జేడీయూ లీడర్ సునీల్ సింగ్ స్పందిస్తూ… కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని అందరికీ తెలుసని..దేశంలో అందరూ అంగీకరించే విషయమేనని తేల్చిచెప్పారు. ప్రశ్నాపత్రం విషయంలో బీజేపీ నేతలు చేసేది అనవసర రాద్ధాంతమంటూ కొట్టిపారేశారు.