Kashmiri Muslims: కశ్మీర్‌లోని శారదా టెంపుల్ నిర్మాణంలో ముస్లిం సోదరులు

కశ్మీర్‌లోని పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మతాల మధ్య సోదరభావం ప్రమోట్ చేసే దిశగా.. మాతా శారదా టెంపుల్ నిర్మాణ పనుల్లో ముస్లిం సోదరులు పాలు పంచుకుంటున్నారు.

Kashmiri Muslims: కశ్మీర్‌లోని శారదా టెంపుల్ నిర్మాణంలో ముస్లిం సోదరులు

Sahrada Temple

Kashmiri Muslims: కశ్మీర్‌లోని పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మతాల మధ్య సోదరభావం ప్రమోట్ చేసే దిశగా.. మాతా శారదా టెంపుల్ నిర్మాణ పనుల్లో ముస్లిం సోదరులు పాలు పంచుకుంటున్నారు. నార్త్ కశ్మీర్ లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న లోకల్ కశ్మీర్ ముస్లింలు ఇందులో భాగమయ్యారని అధికారులు వెల్లడించారు.

నార్తరన్ కశ్మీర్.. కుప్వారా జిల్లాలోని ఈ ఆలయాన్ని శారదాపీఠ్ ఆలయానికి శతాబ్దాల నాటి తీర్థయాత్రను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో నిర్మించనున్నట్లు సేవ్ శారదా కమిటీ (SSC) అధికారులు తెలిపారు. గుడితో పాటు గురుద్వారా, మసీదు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

శారదా యాత్ర ఆలయ కమిటీ (SYTC) కాశ్మీర్‌లోని తీత్వాల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వద్ద పురాతన శారదా ఆలయం, సెంటర్ నిర్మాణ పనులను ప్రారంభించింది.

Read Also : కశ్మీర్‌కు పోటెత్తుతున్న పర్యాటకులు.. తెలుగువాళ్లే ఎక్కువ

నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన పూజలో కశ్మీర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన కశ్మీరీ హిందువులు విచ్చేశారు. పెద్ద మొత్తంలో సిక్కులు, స్థానికులు ఈవెంట్ కోసం వచ్చినట్లు వెల్లడించారు. డిసెంబరు 2021న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది కమిటీ. శ్రింగేరి సౌత్ మట, ఆర్ట్ వర్క్ గ్రానైట్ స్టోన్స్ తో టెంపుల్ ప్లాన్, మోడల్ కు అప్రూవల్ వచ్చింది.