Hajj Pilgrims: హజ్ తీర్థ యాత్రికులకు హారతిచ్చి స్వాగతించిన కశ్మీరీ పండిట్‌లు

శతాబ్దాల తరబడి సౌభ్రాతృత్వాన్ని కాపాడే సంప్రదాయాన్ని కొనసాగించారు కశ్మీరీ పండిట్‌లు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రకు వెళ్లి తిరిగొచ్చిన తీర్థ యాత్రికులకు డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్‌లు శ్రీనగర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

Hajj Pilgrims: హజ్ తీర్థ యాత్రికులకు హారతిచ్చి స్వాగతించిన కశ్మీరీ పండిట్‌లు

Hajj Piligrims

 

 

Hajj Pilgrims: శతాబ్దాల తరబడి సౌభ్రాతృత్వాన్ని కాపాడే సంప్రదాయాన్ని కొనసాగించారు కశ్మీరీ పండిట్‌లు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రకు వెళ్లి తిరిగొచ్చిన తీర్థ యాత్రికులకు డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్‌లు శ్రీనగర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

శనివారం వార్షిక తీర్థయాత్ర ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన మొత్తం 145 మంది హజ్ యాత్రికులకు హారతిచ్చి స్వాగతం పలికారు.

1989లో లోయలో హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా స్థానిక పండిట్లు ముస్లిం సోదరులైన హజ్ యాత్రికులకు సంప్రదాయ శైలిలో స్వాగతం పలికారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హిందూ సోదరులు.. సోదరీమణులు తమను ఆప్యాయంగా, ఆప్యాయతతో స్వీకరించడాన్ని చూసిన యాత్రికులు ఆనందంతో పాటు కృతజ్ఞతతో కనిపించారు.

Read Also : హజ్ యాత్రలో భద్రతకోసం తొలిసారి మహిళా సైనికులు