KCR Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్.. రాష్ట్రపతిని కలిసే అవకాశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రాష్ట్రపతిని పలు అంశాలపై వినతిపత్రం అందజేస్తారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వివరిస్తారు.

KCR Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్.. రాష్ట్రపతిని కలిసే అవకాశం

Kcr Delhi Tour

KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రాభివ‌ృద్ధి, రాజకీయ అంశాల ఎజెండాగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. అలాగే నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు చెప్పనున్నారు. తెలంగాణకు చెందిన వివిధ అంశాలపై ఆయన కేంద్ర మంత్రులను కలుస్తారు.

iPhones: యాపిల్ హవా.. రెట్టింపైన ఐఫోన్స్ అమ్మకాలు

కేంద్రం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గిరిజన రిజర్వేషన్లు, పోడు భూముల చట్ట సవరణ, మైనారిటీ రిజర్వేషన్లు, భద్రాచలం వద్ద గోదావరి ముంపు గ్రామాలను తెలంగాణలో కలపడం వంటి అంశాలపై రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు వరద సాయం, విభజన హామీల అమలుపై విజ్ఞాపనలు అందజేస్తారు. మరోవైపు రాష్ట్రాలకు అప్పుల విషయంలో కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, పార్లమెంటులో చేసిన ప్రకటనలపై ఆర్థిక నిపుణులతో చర్చిస్తారు. తాజా పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై టీఆర్ఎస్ ఎంపీలతో చర్చిస్తారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలపై కూడా పలువురు ప్రముఖులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

5G spectrum auction: నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం.. లక్ష కోట్లకుపైగా ఆదాయంపై అంచనా

ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గరేట్ ఆల్వాకి మద్దతుగా విపక్షాలు నిర్వహించే సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఉన్నారు.