‘ఆదిపురుష్’ – సీతగా కీర్తి సురేష్.. మిగతా క్యారెక్టర్లు ఎవరంటే..

10TV Telugu News

Keerthy Suresh: టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా అనౌన్స్ చేసినప్పటినుండి ఏదో ఒక కొత్త అప్‌డేట్ వస్తూనే ఉంది. ఇక స్టార్ కాస్టింగ్‌కి సంబంధించి పలువురు నటీనటుల పేర్లు వినబడుతున్నాయి..

Adipurush

ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. సీత, హనుమంతుడు క్యారెక్టర్లలో ఎవరు కనిపిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా సీత పాత్ర గురించి అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..

Adipurush

ఇప్పటివరకు అనుష్క శెట్టి, కృతి సనన్ పేర్లు వినిపించారు.. తాజాగా ‘మహానటి’ తో జాతీయ అవార్డ్ అందుకున్న టాలెంటెండ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది.. ‘ఆదిపురుష్’ లో కీర్తి సీత క్యారక్టర్‌లో కనిపించనుంది. చిత్ర బృంద ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపిందని, త్వరలో అధికారక ప్రకటన రానుందని సమాచారం.

Adipurush

ఇక లక్ష్మణుడి పాత్రలో ‘సోనూ కే టిటు కి స్వీటీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారీగా విడుదల చెయ్యనున్నారు.

Adipurush