Keerthy Suresh : దళపతికి కీర్తి సురేష్ బర్త్‌‌డే విషెస్.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకుని, తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. దళపతికి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పింది..

Keerthy Suresh : దళపతికి కీర్తి సురేష్ బర్త్‌‌డే విషెస్.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

Vijay Keerthy Suresh

Keerthy Suresh: ఇళయ దళపతి, కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కలిగిన విజయ్ పుట్టినరోజు నేడు(జూన్ 22). ఈ సందర్భంగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా టైటిల్, ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Vijay – Beast First Look : దళపతి కొత్త సినిమా ‘బీస్ట్’.. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్..

ఇతర భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు, మిగతా హీరోల అభిమానులు విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకుని, తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. దళపతికి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

విజయ్ నటించిన తమిళ్ మూవీ ‘యూత్’ సినిమాలో ‘ఆడ ఆల్ తోట భూపతి నానడా’ అనే సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది. ఈ పాటకు కీర్తి బ్యూటిఫుల్ స్టెప్స్ వేసింది. పవన్ అలెక్స్ అనే కోలీవుడ్ యంగ్ ఆర్టిస్ట్ కీర్తితో పాటు కాలు కదిపాడు. కీర్తి క్యూట్ స్మైల్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేసింది. విజయ్‌కు విషెస్ చెబుతూ కీర్తి సురేష్ వేసిన ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Beast : దళపతి సెకండ్ లుక్.. ‘అరాచకం’ అంటున్న అభిమానులు..

ఈ పాటకున్న విశేషం ఏంటంటే.. తమిళ్‌, తెలుగులో మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చెయ్యగా. శంకర్ మహదేవన్ పాడారు. అక్కడ విజయ్‌తోనూ ఇక్కడ రెబల్ స్టార్ ప్రభాస్‌తోనూ సిమ్రాన్ ఆడిపాడారు. తమిళ్‌లో కబిలన్, తెలుగులో సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశారు.

 

View this post on Instagram

 

A post shared by Pawan Alex (@pawanalex)