lesbian couple: లెస్బియన్ జంటను విడదీసిన పేరెంట్స్.. కలిపిన కోర్టు

లెస్బియన్ జంటను కుటుంబ సభ్యులు విడదీస్తే, వాళ్లను కలిపింది కేరళ హైకోర్టు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. కేరళకు చెందిన అదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయం ఏర్పడింది.

lesbian couple: లెస్బియన్ జంటను విడదీసిన పేరెంట్స్.. కలిపిన కోర్టు

Lesbian Couple

lesbian couple: లెస్బియన్ జంటను కుటుంబ సభ్యులు విడదీస్తే, వాళ్లను కలిపింది కేరళ హైకోర్టు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. కేరళకు చెందిన అదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయం ఏర్పడింది. అక్కడ చదువుకునేటప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అప్పట్నుంచి ఇద్దరూ కలిసే ఉండేవాళ్లు.

Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

ఇండియా వచ్చక కూడా కలిసే ఉన్నారు. అయితే, ఈ విషయం నచ్చని ఇరువురి కుటుంబ సభ్యులు వాళ్లను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ నెల 19న ఫాతిమా దగ్గరికి వచ్చింది అదిల్లా. ఇద్దరూ కలిసి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒకే చోట ఉన్నారు. పోలీసుల సాయంతో వీళ్లు ఉన్న చోటును కనిపెట్టిన బంధువులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ తీసుకుని అలువా అనే సిటీకి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన ఫాతిమా కుటుంబ సభ్యులు, ఆమెను తిరిగి కోజికోడ్ తీసుకెళ్లారు. దీంతో అదిల్లా అలువాలో, ఫాతిమా కోజికోడ్‌లో ఉండిపోయారు. దీంతో తమను విడదీస్తున్నారని అదిల్లా పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసింది. ఈ విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదని అదిల్లా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఫాతిమా తన ఇష్టంతోనే పేరెంట్స్‌తో వెళ్తున్నట్లు రాసిచ్చిందని తెలిపారు.

Bangladesh woman: ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిన యువతి

దీంతో అదిల్లా కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. తన సన్నిహితురాలు ఫాతిమాను కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లారని అదిల్లా పిటిషన్‌లో పేర్కొంది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఫాతిమాను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ఆమె, అదిల్లాతోనే ఉండాలనుకుంటున్నట్లు చెప్పింది. దీనికి అంగీకరించిన కోర్టు వాళ్లిద్దరూ కలిసి ఉండేందుకు అనుమతించింది. చివరకు కోర్టు అనుమతితో అదిల్లా-ఫాతిమా ఒక్కటయ్యారు.