Kerala on high alert: భారీ వర్ష సూచన.. కేరళలో హై అలర్ట్

భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే సూచనతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది.

Kerala on high alert: భారీ వర్ష సూచన.. కేరళలో హై అలర్ట్

Kerala On High Alert

Kerala on high alert: భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే సూచనతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది. రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేసింది. కోచి దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలకు వెళ్లవద్దని కూడా ప్రజలను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. వరద, తుపాను ముప్పు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రకటించారు.

Kerala : గర్ల్స్ స్కూల్లో ఘోరం..60 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులు

రాష్ట్రంలోని డ్యాముల్లో నీటి మట్టం సాధారణ స్థాయిలోనే ఉందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కేరళ రెవెన్యూ మినిష్టర్ కే.రాజన్ తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. 11 సెంటీమీటర్లలోపు వర్షపాతం కురిసే అవకాశం ఉంటే యెల్లో అలర్ట్, 20 శాతంలోపు వర్షపాతం కురిసే అవకాశం ఉంటే ఆరెంజ్ అలర్ట్, 20-24 శాతం వర్షపాతం కురిసే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.