Kerala : కేరళలో కొత్తగా 10,905 కోవిడ్ పాజిటివ్ కేసులు

కేర‌ళ‌ కోవిడ్ ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు.

Kerala : కేరళలో కొత్తగా 10,905 కోవిడ్ పాజిటివ్ కేసులు

Covid (1)

Kerala కేర‌ళ‌లో కోవిడ్ ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున న‌మోద‌వుతోంది. ఆదివారం కేరళ వ్యాప్తంగా 10,905 కొత్త కోవిడ్ కేసులు,62 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 12,879..కేసుల సంఖ్య 28,88,894కి చేరినట్లు తెలిపింది.

అత్యధికంగా రాజధాని తిరువనంతపురంలో 1401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,03,996 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగిందని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా 2,27,24,272 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఇక,ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 10.49శాతంగా ఉందని ఆమె తెలిపారు.