Ramayana: రామాయణంపై క్విజ్.. ముస్లిం విద్యార్థుల విజయం

రామాయణంపై నిర్వహించిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో ముస్లిం విద్యార్థులు విజయం సాధించారు. కేరళకు చెందిన ఒక సంస్థ ఈ క్విజ్ నిర్వహించగా, ఇద్దరు ముస్లిం విద్యార్థులు విజేతలుగా నిలిచారు.

Ramayana: రామాయణంపై క్విజ్.. ముస్లిం విద్యార్థుల విజయం

Ramayana: రామాయణంపై ఒక సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో ముస్లిం విద్యార్థులు విజయం సాధించారు. కేరళకు చెందిన డీసీ బుక్స్ అనే ఆన్‌లైన్‌ సంస్థ గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా రామాయణంపై ఆన్‌లైన్‌ క్విజ్ నిర్వహించింది. ఇందులో ఐదుగురు విద్యార్థులు విజయం సాధించారు.

ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

వీరిలో ఇద్దరు ముస్లిం విద్యార్థులు ఉండటం సంచలనంగా మారింది. మొహమ్మద్ జబిర్ పీకే, మొహమ్మద్ బాసిత్ అనే మలప్పురం పట్టణానికి చెందిన విద్యార్థులు ఈ అరుదైన ఘనత సాధించారు. మొత్తం వెయ్యి మందికిపైగా ఈ క్విజ్‌లో పాల్గొంటే ఈ ఇద్దరూ టాప్‌లో నిలిచారు. వీరు వాలాంచెరీ అనే ప్రాంతంలో వాఫీ కోర్స్ చదువుతున్నారు. ఇది ఇస్లామిక్ స్టడీస్‌కు సంబంధించిన ఎనిమిదేళ్ల ప్రత్యేక కోర్సు. మగవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇస్లాంకు సంబంధించిన విషయాలు నేర్పుతారు. అలాగే దేశంలోని ఇతర మతాలకు సంబంధించిన అంశాల్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందూత్వం, బౌద్ధం, జైనం, సిక్కిజం, క్రైస్తవం, టావోయిజం వంటి వాటి గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది.

Cow Dung Rakhis: ఆవుపేడతో తయారైన రాఖీలు.. విదేశాలకు ఎగుమతి

‘‘భిన్న మతాలు కలిగిన సమాజంలో నివసించేటప్పుడు అన్ని మతాలకు సంబంధించిన అంశాలపై అవగాహన ఉండేలా ఈ కోర్సును మా ప్రిన్సిపల్ రూపొందించారు. ఈ కోర్సు ఆధారంగా కొందరు సీనియర్లు ఇతర మతాలకు సంబంధించిన అంశాలపై పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. మా స్టడీలో భాగంగా రామాయణం గురించి చదువుకున్నాను. లైబ్రరీలోని పుస్తకాలు కూడా దీనికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోగలిగాను. అన్ని మతాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మతాల పేరుతో జరిగే హింసను ఆపగలం. రామాయణం.. ప్రేమ, శాంతి గురించి చెబుతుంది’’ అని జబిర్ అన్నాడు.