Kerala: అలిగిన త‌మ్ముడికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ 434 మీట‌ర్ల భారీ లేఖ రాసిన యువ‌తి

క్షమాపణలు చెప్పాలనుకుంటే ఫోనులో మెసేజ్ చేస్తాం. లేఖ రూపంలోక్షమాపణలు చెప్పాలనుకుంటే ఓ పేజీ మించ‌కుండా రాస్తాం. అయితే, ఓ అమ్మాయి మాత్రం త‌న త‌మ్ముడికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ 434 మీట‌ర్ల భారీ లేఖ రాసింది. ఆ లేఖ బ‌రువు 5 కిలోలు ఉంది.

Kerala: అలిగిన త‌మ్ముడికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ 434 మీట‌ర్ల భారీ లేఖ రాసిన యువ‌తి

Letter

Kerala: క్షమాపణలు చెప్పాలనుకుంటే ఫోనులో మెసేజ్ చేస్తాం. లేఖ రూపంలో క్షమాపణలు చెప్పాలనుకుంటే ఓ పేజీ మించ‌కుండా రాస్తాం. అయితే, ఓ అమ్మాయి మాత్రం త‌న త‌మ్ముడికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ 434 మీట‌ర్ల భారీ లేఖ రాసింది. ఆ లేఖ బ‌రువు 5 కిలోలు ఉంది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. పీర్మ‌డేలోని ఇడుక్కి ప్రాంతంలో నివ‌సించే కృష్ణ ప్ర‌సాద్‌(21)కు కృష్ణ ప్రియ (28) అనే అక్క ఉంది. ఆమె తిరువ‌నంత‌పురంలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. మే 24న ప్రపంచ సోద‌రుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమె త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతుంద‌ని కృష్ణ ప్ర‌సాద్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు.

Presidential polls: ఇదొక‌ గొప్ప యుద్ధం: య‌శ్వంత్ సిన్హా

అయితే, ఆమె ఆ ప‌ని చేయ‌లేదు. దీంతో ఆమెకు అదే రోజు కృష్ణ ప్ర‌సాద్ మెసేజులు పంపాడు. అయినా రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డంతో ఫోన్ చేశాడు. ఆమె స్పందించ‌లేదు. ఇత‌రులు చాలామంది త‌న‌కు ప్రపంచ సోద‌రుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెబుతున్నప్ప‌టికీ కృష్ణ ప్రియ మాత్రం చెప్ప‌డం లేదంటూ ఆమెకు వాట్సాప్‌లో స్క్రీన్ షాట్లు పంపాడు. అయినా రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డంతో కృష్ణ ప్రియను నంబ‌ర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు. దీంతో తాను చేసిన ప‌నికి త‌న త‌మ్ముడు కృష్ణ ప్ర‌సాద్ బాధ‌ప‌డిపోయాడ‌ని తెలుసుకున్న కృష్ణ ప్రియ లేఖ రూపంలో క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నుకుంది. దీంతో స్టేష‌న‌రీకి వెళ్ళి 15 రోళ్ళ పేప‌ర్ కొనుక్కుంది.

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

దాదాపు 12 గంట‌లు క‌ష్ట‌ప‌డి దానిపై క్ష‌మాప‌ణ‌లు కోరుతూ, త‌మ్ముడితో చిన్న‌నాటి జ్ఞాప‌కాలన్నింటినీ అక్ష‌ర రూపంలో రాసి, పంపింది. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ”ప్ర‌తి ఏడాది నా త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు చెబుతాను. మా బంధం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. నేను ఈ సారి తీరిక లేకుండా ఉండ‌డంతో శుభాకాంక్ష‌లు చెప్ప‌డం మ‌ర్చిపోయాను. త‌దుప‌రి రోజు నేను నా ఫోన్ చూడ‌గా కృష్ణ ప్ర‌సాద్ నుంచి చాలా మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు తెలుసుకున్నాను” అని తెలిపింది. ఆ లేఖ చూసిన కృష్ణ ప్ర‌సాద్ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. అతి పెద్ద లేఖ రాసినందుకు దీన్ని గుర్తించాలంటూ కృష్ణ ప్రియ గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేసుకుంది.