IRCTC Tatkal Tickets: రైల్వేశాఖ కీలక నిర్ణయం.. తత్కాల్ టికెట్లలో అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ - టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్ ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది.

IRCTC Tatkal Tickets: రైల్వేశాఖ కీలక నిర్ణయం.. తత్కాల్ టికెట్లలో అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు

Indian Railway

IRCTC Tatkal Tickets: రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ – టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్ ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది. రైల్వేశాఖ ఈ- టికెటింగ్ విధానంలో ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్లను కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయని, దీంతో తత్కాల్ కోటాలోని దాదాపు 35శాతం టికెట్లు దారి మళ్లుతున్నట్లు ఐఆర్సీటీసీ నియమించిన గ్రాంట్ థాంటన్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది. ఫేక్ ఐడీలతో అక్రమంగా బల్క్ బుకింగ్ చేస్తున్నట్లు తేలింది.

Bhadrachalam Ramalayam Land : భద్రాద్రి రాములోరి భూములు అన్యాక్రాంతం..ఆక్రమణకు గురవుతున్న వందలాది ఎకరాలు

తత్కాల్ టికెట్ల అక్రమాలకు చెక్ పెట్టేలా ఈ- టికెట్ల విధానంలో సమూల మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇదిలాఉంటే ఈ- టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐఆర్ సీటీసీ పోర్టల్ సామర్థ్యాన్ని కూండా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2021 డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం.. 80.5శాతం రైల్వే టికెట్లు ఈ- టికెటింగ్ విధానంలోనే బుక్ చేస్తున్నారు. ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలోని కౌంటర్ల వద్ద కంటే ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా మూడు రెట్లు అధికంగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.

Made In India F-INSAS..Nipun : ఇండియన్ ఆర్మీకి రక్షణ శాఖ అందించిన అత్యాధునిక ఆయుధాల ప్రత్యేకత..ఉపయోగాలు..

ఇదిలాఉంటే 2014లో అప్ గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ పోర్టల్ కు సగటున నిమిషానికి 28వేల లావాదేవీలు సాగించే సామర్థ్యముంది. ఎనిమిదేళ్లలో డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో పోర్టల్ సామర్థ్యాన్ని పెంచి 40వేల వరకు లావాదేవీలు సాగించే సామర్థ్యంతో పోర్టల్ ను అప్ గ్రేడ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. 2022 నవంబర్ నాటికి అప్ గ్రేడ్ చేసిన పోర్టల్ సేవలను ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేలా రైల్వే శాఖ చర్యలు వేగవంతం చేసింది.