KGF Chapter 2 : ‘కె.జి.యఫ్ 2’ కొత్త రిలీజ్ డేట్..

రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీ.. ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2..

KGF Chapter 2 : ‘కె.జి.యఫ్ 2’ కొత్త రిలీజ్ డేట్..

Kgf Chapter 2

KGF Chapter 2: రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీ.. ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2.

కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ‘అధీరా’, రవీనా టాండన్ ‘రమికా సేన్’ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. రావు రమేష్, ఈశ్వరీ రావు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Kgf 2

‘కె.జి.యఫ్ 2’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ సినిమా టీజర్ సాధించలేని రికార్డ్ రాకీ భాయ్ క్రియేట్ చేశాడు. విడుదలైన కొద్ది గంటలకే 100 మిలియన్ల మార్క్ టచ్ చేసింది టీజర్.

ముందుగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూలై 16న విడుదల చెయ్యాలనుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల అది వీలు పడలేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ‘సలార్’ కి షిఫ్ట్ అయిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది. లాక్‌డౌన్ సడలింపులతో బ్యాలెన్స్ వర్క్‌ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్‌గా ‘కె.జి.యఫ్ 2’ మూవీని భారీగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.