జూలై 16న రాఖీ భాయ్ రాక..

జూలై 16న రాఖీ భాయ్ రాక..

KGF Chapter 2: రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

‘కె.జి.యఫ్ 2’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ సినిమా టీజర్ సాధించలేని రికార్డ్ రాకీ భాయ్ క్రియేట్ చేశాడు. విడుదలైన కొద్ది గంటలకే 100 మిలియన్ల మార్క్ టచ్ చేసింది టీజర్.

KGF 2

ఇక ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ శుక్రవారం అనౌన్స్ చేశారు. జూలై 16న ‘కె.జి.యఫ్ 2’ విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ‘అధీరా’, రవీనా టాండన్ ‘రమికా సేన్’ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.