Yash: ‘రారాజు’గా రాబోతున్న కేజీయఫ్ హీరో!

కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కన్నడ హీరో యశ్. దర్శకుడు ప్రశాంత్ నీల్....

Yash: ‘రారాజు’గా రాబోతున్న కేజీయఫ్ హీరో!

Kgf Hero Yash New Movie Raaraju Trailer Launched By Vv Vinayak

Yash: కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కన్నడ హీరో యశ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాల్లో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను కూడా సాధించాడు ఈ హీరో. ఇక తాజాగా యశ్ నటించిన ఓ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Yash : KGF 2 ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాల్సిందే.. వర్కౌట్ అవుతుందా??

అయితే ఈ సినిమా కేజీయఫ్ కంటే ముందే యశ్ నటించిన సినిమా కావడం విశేషం. కన్నడలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాను తెలుగులో ‘రారాజు’ అనే పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ వివి.వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించే విధంగా ఉందని దర్శకుడు వివి.వినాయక్ అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలను రిలీజ్ చేసిన పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గారు, యశ్ నటించిన ఈ సినిమాను రిలీజ్ చేయడం తనకెంతో సంతోషంగా ఉందని.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

Hero Yash: ఆచితూచి అడుగేస్తున్న యష్.. ప్రభాస్ నుండి రాఖీ భాయ్ గుణపాఠం!

ఇక రారాజు సినిమాను జూన్ సెకండ్ వీక్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యశ్ అతడి భార్య రాధిక పండిట్ కలిసి నటించగా, ఈ సినిమా కన్నడనాట భారీ విజయాన్ని అందుకుందని.. తెలుగులోనూ ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నిర్మాత సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. మరి యశ్ నటించిన ‘రారాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.