అభిమాని ఆత్మహత్య, అంతిమయాత్రకు యశ్ రావాలనేదే చివరి కోరిక

అభిమాని ఆత్మహత్య, అంతిమయాత్రకు యశ్ రావాలనేదే చివరి కోరిక

Yash Fan: కర్నాటకలోని ఓ 25ఏళ్ల యువకుడు మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాండ్యా పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణ అనే వ్యక్తి కే.జీ.ఎఫ్ స్టార్ హీరో యశ్‌కు, దాంతో పాటు కర్నాటక ప్రతిపక్ష లీడర్ సిద్దరామయ్యకు డై హార్డ్ ఫ్యాన్. ఈ గ్రామం బెంగళూరు టెక్ హబ్ కు 105కిలోమీటర్ల దూరం ఉంది.

సూసైడ్ చేసుకున్న వ్యక్తి.. ఒక్క పేజిలోనే కన్నడ భాషలో రాసిన ఆత్మహత్య గురించి రాసుకొచ్చాడు. అందులో తన చివరి కోరికలుగా సిద్దరామయ్య, యశ్ లు అంత్యక్రియలకు రావాలని కోరాడు. ఇదే నా చివరి కోరిక అని డెత్ నోట్ లో రాశాడు.

జీవితంలో చాలా కోల్పోయానని.. తల్లికి మంచి కొడుకుగా ఫెయిల్ అయ్యానని, అన్న మంచి తమ్ముడ్ని కాలేకపోయానని, ప్రేమలోనూ ఓడిపోయానని పేర్కొన్నాడు. ఇక తాను జీవితంలో సాధించడానికి ఏమీ లేదని ఇలాగే తనువు ముగించాలనుకుంటున్నట్లు రాశాడు.

ఘటన గురించి తెలుసుకున్న సిద్ధరామయ్య కోడిదొడ్డి గ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘నేను అతణ్ని కలిశానని అనుకోవడం లేదు. కానీ, అభిమానిని ఇలాంటి పరిస్థితుల్లో కలవడం చాలా బాధాకరం. ఇంత చిన్నవ వయస్సులో జీవితం ముగించాలని ఎవరూ అనుకోరు’ అని అన్నారు.

అతని మరణంపై కేజీఎఫ్ హీరో యశ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. నటులుగా మేం మీ మనసుకు దగ్గరగా ఉంటాం. మాపై వేసే విజిల్స్, ప్రేమ, అభిమానం అన్నీ వింటాం. ఇలాంటి ఘటనలు మాత్రం మీ నుంచి ఊహించం అని ట్వీట్ చేశాడు. ఈ మరణంపై కేసు రిజిష్టర్ చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.