కె.జి.యఫ్ 2లో పవర్‌ఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్..

యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

కె.జి.యఫ్ 2లో పవర్‌ఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్..

KGF Team Womens Day: యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

K.G.F 2

‘కె.జి.యఫ్ 2’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ సినిమా టీజర్ సాధించలేని రికార్డ్ రాకీ భాయ్ క్రియేట్ చేశాడు. విడుదలైన కొద్ది గంటలకే 100 మిలియన్ల మార్క్ టచ్ చేసింది టీజర్.

నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్ క్యారెక్టర్ చేస్తున్న రవీనా టాండన్‌తో పాటు కథానాయిక శ్రీనిధి శెట్టి, రాకీ తల్లి పాత్రలో ఆకట్టుకున్న అర్చన జాయిస్, కీలకపాత్రలో కనిపించనున్న ఈశ్వరి రావు, ఛీఫ్ ఎడిటర్ దీపా హెగ్డేగా నటించిన మాళవికా అవినాష్‌ల పోస్టర్ రిలీజ్ చేశారు.

KGF 2

జూలై 16న ‘కె.జి.యఫ్ 2’ విడుదల కానుంది. కాగా తమ హీరో సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో జూలై 16వ తేదీని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లెటర్ రాశారు యష్ ఫ్యాన్స్.

K.G.F 2