Kiara Advani : ఎన్టీఆర్ సరసన కియారా..?

కియారా అద్వానీ క్రేజీ ఆఫర్లతో కెరీర్‌లో బిజీ అయిపోతోంది.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో డేట్స్ లేవని చెబుతున్న కియారా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది..

Kiara Advani : ఎన్టీఆర్ సరసన కియారా..?

Kiara Advani

Kiara Advani: నార్త్ అమ్మాయి అయినా.. సౌత్ సినిమాలతోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసి మళ్లీ నార్త్ వెళ్లిన ఈ భామ అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. బాలీవుడ్‌లో ఎంత బిజీగా ఉన్నా సౌత్‌లో సినిమాలు చెయ్యడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటా అంటోంది. మరి కియారా నెక్ట్స్ చెయ్యబోతున్న తెలుగు సినిమా ఏంటో తెలుసా..?

కియారా అద్వానీ క్రేజీ ఆఫర్లతో కెరీర్‌లో బిజీ అయిపోతోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో డేట్స్ లేవని చెబుతున్న కియారా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. నాన్‌స్టాప్‌గా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. తెలుగులో ముచ్చటగా మూడో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. వరుస సినిమాలతో తెలుగులో ఇంకా బిజీ అయిపోతుందనుకున్న టైమ్‌లోనే బాలీవుడ్ ఆఫర్లతో బాగా బిజీ అయిపోయింది కియారా అద్వానీ.

రీసెంట్‌గా తన ఫ్యాన్స్‌తో చేసిన ఇంటరాక్షన్‌లో మరిన్ని సౌత్ సినిమాలలో చూడాలనకుంటున్నాం అని ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు త్వరలోనే ఈ విషయం గురించి గుడ్ న్యూస్ వింటారు అంటూ సమాధానం చెప్పింది కియారా. దాంతో త్వరలో ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కియారానే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్.

అసలు కియారాకు హీరోయిన్‌గా ఇమేజ్, క్రేజ్ వచ్చింది తెలుగు సినిమాతోనే. టాలీవుడ్‌లో స్టార్ హీరో మహేష్‌‌తో కొరటాల డైరెక్షన్‌లో ‘భరత్ అనే నేను’ సినిమా చేసింది కియారా. క్యూట్‌గా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉండే కియారా ఈ సినిమాలో ఇంకా క్యూట్‌గా కనిపించి తెగ ఇంప్రెస్ చేసేసింది. సో.. కొరటాల మళ్లీ కియారాని రిపీట్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో 3, 4 సినిమాలతో బిజీగా ఉన్న కియారా మళ్లీ సౌత్‌కి వస్తున్నానన్న హింట్ ఇవ్వగానే తెగ ఖుష్ అయిపోతున్నారు ఫ్యాన్స్.