Khiladi lady: తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. పోలీస్ స్టేషన్ ముందు హల్‌చల్

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో భర్తతో రెండు నెలలు కాపురం చేసింది.. భార్య తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది.

Khiladi lady: తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. పోలీస్ స్టేషన్ ముందు హల్‌చల్

Khiladi Lady

Khiladi lady: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో భర్తతో రెండు నెలలు కాపురం చేసింది.. భార్య తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై నిలదీయండంతో భర్తపైనే గొడవకు దిగింది. దీంతో తనకు విడాకులు కావాలంటూ భర్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. విషయం తెలుసుకున్న కిలాడి లేడీ తనను భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి హల్ చల్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలుగు మాట్రిమోనీ లో పరిచయమై 2019 ఏప్రిల్ 10న కర్నాటి స్వప్న, వెంకటేష్ లు వివాహం చేసుకున్నారు. స్వప్న స్వస్థలం మహబూబాబాద్. అయితే ఆమె హైదరాబాదులో నివాసం ఉంటుంది. వెంకటేష్ ది కృష్ణా జిల్లా గంపలగూడెం. పెళ్లి అయ్యాక జాబ్ కోసం ఇద్దరు బెంగుళూరుకు వెళ్లారు. పెళ్లయిన రెండు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది.

Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

ఈ రెండు నెలల కాలంలో స్వప్న తరుచూ ఫోన్ లో మాట్లాడుతూ కోర్టు విషయాలలో తలమునకలై ఉండేది. ఏంటని భర్త ప్రశ్నిస్తే తనతో గొడవలకు దిగేది. ఇలా నడుస్తున్న క్రమంలో ఓరోజు బెంగుళూరు నుంచి ఆకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్ళాలని భర్తను పట్టుబట్టింది. వెళ్లొచ్చాక మళ్ళీ వెళ్ళాలని అనడంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు విషయం ఏమిటా అని వెకంటేశ్ ఆరా తీయడం మొదలు పెట్టాడు. దీంతో స్వప్న వ్యవహారం తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. స్వప్న గతంలో ఎనిమిది మందిని పెళ్లి చేసుకుందని, తొమ్మిదో వాడిని నేనని గుర్తించిన వెంకటేష్ విడాకులు కావాలని కోరాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్వప్న వ్యవహారాన్ని వివరించారు. విషయం తెలుసుకున్న స్వప్న భర్త తనను వేధిస్తున్నాడంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది.

Covid-19 Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

స్వప్న తీరుతో నివ్వెర పోయిన భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పాడు. ఎప్పుడు ఏ సంవత్సరం లో ఎవరిని పెళ్ళి చేసుకుంది, వారి నుంచి ఎంత డబ్బు లాగిందనే విషయాలను పోలీసులకు వివరించాడు. కొందరైతే స్పప్న చేసిన మోసాన్ని భరించలేక చనిపోయారని వెంకటేష్ పోలీసులకు వివరించాడు. అయితే పోలీసులు భార్య, భర్త ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం కాస్తా జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లగా.. పోలీస్ భాష్ సూచన మేరకు టౌన్ పోలీసులు వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.