నో అరెస్ట్.. ఓన్లీ ఎన్‌కౌంటర్.. నాగ్ ‘వైల్డ్ డాగ్’ విశ్వరూపం..

‘కింగ్’ నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించనున్నారు. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు..

నో అరెస్ట్.. ఓన్లీ ఎన్‌కౌంటర్.. నాగ్ ‘వైల్డ్ డాగ్’ విశ్వరూపం..

Wild Dog Trailer

Wild Dog Trailer: ‘కింగ్’ నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. అహిషోర్ సోల్మ‌న్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో కనిపించనున్నారు. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు..

Wild Dog

శుక్రవారం ‘వైల్డ్ డాగ్’ థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ‘వైల్డ్ డాగ్’ కంప్లీట్ నాగ్ వన్ మ్యాన్ షో అనిపించేలా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నాగ్ సరికొత్త గెటప్‌లో ఏసీపీ విజయ్‌ వర్మ క్యారెక్టర్లో అలరించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశారు. హైదరాబాద్‌లో జరిగిన గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది..

బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళను పట్టుకోవడానికి ‘వైల్డ్ డాగ్’ టీమ్ పని చేస్తుంది.. ఈ టీమ్ దేనికైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు, ప్రాణాలను సైతం లెక్కచేయని టీమ్.. విజువల్స్, ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. ఏప్రిల్ 2 నుండి వెండితెరపై కింగ్ ‘వైల్డ్ డాగ్’ ఆపరేషన్ స్టార్ట్ కానుంది.