Viral Video : అత్తగారి 60వ పుట్టినరోజుకు కోడలి 60 రకాల వంటకాలు…ఎక్కడంటే…

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు చేసిన వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదాఅవుతున్నారు.

10TV Telugu News

Viral Video : అత్తాకోడళ్ళ మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా అరుదు. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్ళ మధ్య నిరంతం గీచులాట, పోరాటం వంటి దృశ్యాలు నిత్యం. అత్తాకోడళ్లు అనుబంధం బాగుంటే ఆఇల్లు ఆనందంగా కళకళలాడుతుంది. ప్రస్తుతం ఇదే తరహాలో అత్తకోడళ్ళ మధ్య ఉన్న ప్రేమను చాటిచెప్పే ఓ వీడియో వైరల్ గా మారింది. అత్తగారి 60వ పుట్టిన రోజుకు కోడలు తన ప్రేమను చాటుతూ ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసి అశ్చర్యపోయేలా చేసింది.

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు చేసిన వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదాఅవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని తెగమెచ్చుకుంటున్నారు. నిత్యం టివిల్లో అత్తాకోడళ్ళ మధ్య పోరాట సన్నివేశ సీరియళ్ళు చూసి విసిగిపోయిన వారికి, ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్త కోసం కోడలు తయారు చేసిన వంటకాల వీడియో ముచ్చటగొలిపేలా ఉంది.

కోడలు అత్తగారి పుట్టినరోజుకోసం 60 రకాల వంటలను సిద్ధం చేయటం చూసి అంతా ఆశ్ఛర్యపోతున్నారు. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీడియోలో వీటన్నింటిని చూసిన నెటిజన్లకు నోరూరిపోతుండటం ఖాయం. ఏది ఏమైనప్పటికీ అత్తగారిపై కోడలు ఇంతలా ప్రేమను చూపించటం చాలా గొప్ప విషయమేనంటున్నారు అంతా…

10TV Telugu News