Bishak Mondal: రైతు బిడ్డ రికార్డ్.. లండన్‌లో రూ.1.8కోటి రూపాయల జీతం

ఆ రైతు కష్టం ఊరికేపోలేదు. శ్రమించి చదివించిన కొడుకు భారీవేతనంతో చదువు పూర్తి కాకుండానే వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాడు. జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన బిశాఖ్ మోండాల్ అనే నాలుగో సంవత్సరం విద్యార్థికి రూ.1.8కోట్ల జీతంతో కూడిన జాబ్ వచ్చింది.

Bishak Mondal: రైతు బిడ్డ రికార్డ్.. లండన్‌లో రూ.1.8కోటి రూపాయల జీతం

Jadhav University

Bishak Mondal: ఆ రైతు కష్టం ఊరికేపోలేదు. శ్రమించి చదివించిన కొడుకు భారీవేతనంతో చదువు పూర్తి కాకుండానే వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాడు. జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన బిశాఖ్ మోండాల్ అనే నాలుగో సంవత్సరం విద్యార్థికి రూ.1.8కోట్ల జీతంతో కూడిన జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఏడాది సాధించిన జీతాలన్నీ కోటికి లోపే కాగా, మోండాల్ రికార్డ్ స్థాయిలో శాలరీని సంపాదించాడు.

లండన్ లోని ఫేస్ బుక్ సంస్థలో మోండాల్.. సెప్టెంబరులో జాయిన్ కావాల్సి ఉంది. “మంగళవారం అర్ధరాత్రి తనకు ఈ జాబ్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది” అని మోండాల్ వివరించాడు.

మహమ్మారి సమయంలో పలు ఆర్గనైజేషన్లలో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసిన మోండాల్ కు చదువులకు మించిన నాలెడ్జ్ సంపాదించడంతో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బాగా ఉపయోగపడిందని చెప్తున్నాడు.

Read Also : చేసేది నర్సు ఉద్యోగం..కానీ బాడీబిల్డింగులతో అదరగొట్టేస్తోంది..ఎందుకంటే

బీర్‌భూమ్‌లోని రామ్‌పూర్‌హట్‌లో అతని తండ్రి రైతుకాగా.. తల్లి అంగన్‌వాడీ వర్కర్‌. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అయితే ఫేస్‌బుక్‌ కంటే ముందు అతనికి గూగుల్‌, అమెజాన్‌ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్‌బుక్‌ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు.