Kolkata : టీ అమ్ముతూ…కిశోర్ కుమార్ సాంగ్స్, వీడియో వైరల్

కిషోర్ కుమార్..సాంగ్స్ వింటుంటే పరవశింప పోతుంటారు. ఆయన గాత్రంతోనే..ఎన్నో చిత్రాలు విజయవంతమైనాయంటే..అతిశయోక్తి కాదు. కిశోర్ పాటలతోనే...సూపర్ స్టార్స్ గా వెలిగారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆయన పాటలను ఓ టీవాలా...పాడుతూ..అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

Kolkata : టీ అమ్ముతూ…కిశోర్ కుమార్ సాంగ్స్, వీడియో వైరల్

Kishore

Kolkata Tea Seller : కిశోర్ కుమార్..సాంగ్స్ వింటుంటే పరవశింప పోతుంటారు. ఆయన గాత్రంతోనే..ఎన్నో చిత్రాలు విజయవంతమైనాయంటే..అతిశయోక్తి కాదు. కిశోర్ పాటలతోనే…కొంతమంది సూపర్ స్టార్స్ గా వెలిగారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆయన పాటలను ఓ టీవాలా…పాడుతూ..అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. దుకాణాలకు వచ్చే కస్టమర్లకు టీ అందిస్తూ..కిశోర్ కుమార్ సాంగ్స్ పాడుతున్నాడు. చేతిలో ఓ మైక్ పట్టుకుని..మరో చేతితో టీ పోస్టూ..సాంగ్స్ ఆలపిస్తున్నారు. కోల్ కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఈ వీడియోను తీసి…పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారింది.

ఆగస్టు 04వ తేదీ కిశోర్ కుమార్ బర్త్ డే. ఉత్తర కోల్ కతాకు చెందిన పల్తాన్ నాగ్ అనే వ్యక్తి టీ విక్రయిస్తుంటారు. బెనియటోలా వీధిలో టీ దుకాణం నిర్వహించే ఇతని వద్దకు చాలా మంది వస్తుంటారు. అయితే..ఇతనికి కిశోర్ కుమార్ అంటే ఎంతో ఇష్టం. ఆగస్టు 04వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా..కిశోర్ కుమార్ టీ షర్టు ధరించి..సాంగ్స్ పాడాడు. ఎలా అంటే..అచ్చం..కిశోర్ కుమార్ పాడినట్లే..పాడడం ఆకట్టుకుంది. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు టీ అందిస్తూ ఆపై కిషోర్ కుమార్ పాట‌లు పాడుతుంటాడు. ఈ సమయంలో అక్కడనే ఉన్న ఓ కస్టమర్ వీడియో తీశాడు.

అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆగస్టు 04వ తేదీన అప్ లోడ్ అయిన ఈ వీడియో కొద్ది రోజుల్లోనే తెగ వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా…పాపులర్ అయ్యారు. గత 40 ఏళ్లుగా తాను కిశోర్ కుమార్ పాటలు పాడుతున్నట్లు, రోజులాగానే టీ సర్వ్ చేస్తూ..పాటలు పాడినట్లు వెల్లడించారు. పాటలు పాడడం తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని, స్టేజీలపై కూడా సాంగ్స్ పాడినట్లు తెలిపారు. కుటుంబపోషణకు టీ దుకాణం నడుపుతున్నట్లు పల్తాన్ నాగ్ తెలిపారు.