Neem Trees: కోల్‌కతాలో చనిపోతున్న వేప చెట్లు.. కారణం ఏంటంటే

మన దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన చెట్లలో వేప ప్రధానమైంది. ఈ చెట్టు నుంచి వచ్చే ఆకులు, కాయలను యాంటీ బ్యాక్టీరియల్‌గా వాడుతారు. కృత్రిమ ఎరువుల తయారీలోనూ వినియోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్నాయని భావించే వేప చెట్లే ఇప్పుడు ప్రమాదపుటంచున ఉన్నాయి.

Neem Trees: కోల్‌కతాలో చనిపోతున్న వేప చెట్లు.. కారణం ఏంటంటే

Neem Trees

Neem Trees: మన దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన చెట్లలో వేప ప్రధానమైంది. ఈ చెట్టు నుంచి వచ్చే ఆకులు, కాయలను యాంటీ బ్యాక్టీరియల్‌గా వాడుతారు. కృత్రిమ ఎరువుల తయారీలోనూ వినియోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్నాయని భావించే వేప చెట్లే ఇప్పుడు ప్రమాదపుటంచున ఉన్నాయి. కోల్‌కతాలో అనేక వేప చెట్లు ఇటీవల మరణిస్తున్నాయి.

Major: మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం వసూలు!

మరికొన్ని తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. అంటే పచ్చగా ఉండాల్సిన ఆకులు పాలిపోయి, పసుపు రంగులోకి మారుతున్నాయి. తర్వాత రాలిపోతున్నాయి. ఈ విషయం నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణ మార్పులే దీనికి కారణమని వాళ్లు చెబుతున్నారు. ఫంగల్ వ్యాప్తి కారణంగానే వేప చెట్లు మరణిస్తున్నాయని బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ హిమాద్రి శేఖర్ దేవనాథ్ అన్నారు. ‘‘కోల్‌కతాలోని టోలీగుంగే ఏరియాలో మొదట వేప చెట్లు చనిపోతున్నట్లు గుర్తించాం. వెంటనే ఆ చెట్లకు మందులు అందించాం. చాలా వరకు చెట్లు తిరిగి కోలుకున్నాయి. దీనికి కారణమైన వైరస్‌ను గుర్తించాం.

Major: మేజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ వైరస్ సోకేందుకు అనేక కారణాలుంటాయి. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వ్యాధి వస్తుంది. రెండేళ్లక్రితం కూడా కోల్‌కతాలో ఈ వ్యాధి వచ్చింది. అప్పుడు చికిత్స అందిస్తే చాలా వరకు కోలుకున్నాయి. తిరిగి మళ్లీ ఇప్పుడు ప్రారంభమైంది’’ అని హిమాద్రి వివరించారు. గతంలో తెలంగాణ, పుణేలోనూ ఈ వ్యాధి వచ్చినట్లు ఆయన తెలిపారు. కోల్‌కతాలో రెండు వేలకుపైగా వేప చెట్లు ఉన్నట్లు అంచనా.