‘కోలుకోలమ్మా కోలో నా సామీ’.. సాయి పల్లవి అదరగొట్టేసిందిగా!..

‘కోలుకోలమ్మా కోలో నా సామీ’.. సాయి పల్లవి అదరగొట్టేసిందిగా!..

Kolu Kolu Song Promo​: సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’.. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’’ అనేది ట్యాగ్‌లైన్..

Viraata parvam

ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో లంగా ఓణీలో గ్రామీణ యువతి లుక్‌లో సైకిల్ తొక్కుతూ కనిపించి, పక్కా పల్లెటూరి పిల్లలా ఆకట్టుకుంది సాయి పల్లవి. ‘విరాట పర్వం’ లో తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆమె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితం ‘కోలుకోలమ్మా కోలో నా సామీ’.. అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

https://10tv.in/sai-pallavi-will-leave-you-spellbound-as-vennela/

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసి, దివ్య మాలికతో కలిసి పాడగా.. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ప్రోమోలో సాయి పల్లవి తన హావభావలతో ఆకట్టుకుంది. ఫిబ్రవరి 25న ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్నారు. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కీలకపాత్రల్లో నటిస్తున్న ‘విరాట పర్వం’ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.