Komatireddy Rajagopal Reddy : ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి

బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

Komatireddy Rajagopal Reddy : ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy : బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షా ను కలిశారు. ఆయనతో భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Komati Reddy Brothers in Delhi : ఢిల్లీలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు..అమిత్ షాతో భేటీ

కాంగ్రెస్ కు రాజీనామా తర్వాత రాజగోపాల్ రెడ్డి మొదటిసారిగా అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరే అంశంపై రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో చర్చించారు. అమిత్ షా తనను బీజేపీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమే అని చెప్పారు.

Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించినా ఇంకా అవి పరిష్కారం కాలేదన్నారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. నేను రాజీనామా చేస్తే మునుగోడుకు మంచి జరుగుతుందన్నారు. ఈ నెల 21న మునుగోడుకు వచ్చేందుకు అమిత్ షా అంగీకరించారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అమిత్ షాను కలవాలని బండి సంజయ్ తనకు సూచించారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. డేట్ ఫిక్స్ చేస్తే తానే వస్తానని అమిత్ షా చెప్పారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”గత మూడున్నరేళ్లుగా అనుకున్న స్థాయిలో మునుగోడులో అభివృద్ధి చేయలేకపోయాను. నన్ను గెలిపించిన ప్రజలు కూడా సంతోషంగా లేరు. నా నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం మునుగోడు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి సహకారం లేదు.

గత ఎనిమిదున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నిక వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎన్నికలో గెలిచేందుకు ఆ నియోజకవర్గానికి వందల వేల కోట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను రాజీనామా చేశాను. మీరు రాజీనామా చేస్తే మాకు న్యాయం జరుగుతుందని మెజార్టీ ప్రజలు, నాయకులు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను.

అసెంబ్లీ స్పీకర్ నాకు అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే ఆయనను కలిసి నా రాజీనామాను ఆమోదింపజేసుకుంటాను. నా రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయని ఆశిస్తూ పదవీ త్యాగం చేశా. అదే విధంగా ఈ ఎన్నిక ద్వారా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం. మునుగోడు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెస్తుందని, కుటుంబపాలనకు అంతం పలుకుతుందని ఆశిస్తున్నా. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను” అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.