Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..

కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ కొండా సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఈ సినిమా నుంచి. కొండా సినిమాని...................

Konda :  సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..

Konda :  కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ కొండా సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఈ సినిమా నుంచి. కొండా సినిమాని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన కొండా సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. అయితే దీనికి ముఖ్య అతిధిగా రేవంత్ రెడ్డి రావాల్సి ఉంది.

కానీ రేవంత్ రెడ్డిని మార్గ మధ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. దీంతో ఈ విషయంపై కొండా దంపతులు సీరియస్ అయ్యారు. ఆర్జీవీ కూడా దీన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాని కొండా దంపతుల కుమార్తె సుస్మితపటేల్ నిర్మించింది. కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుస్మితాపటేల్‌ మాట్లాడుతూ.. ”ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా? నీ బతుకంతా భయంతోనేనా? మొన్న విరాటపర్వంకి సాయి పల్లవికి రెడ్‌కార్పెట్‌ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవత్‌రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు? ఎన్నికలు రానియ్‌ నీ సంగతి చెబుతా..” అంటూ సీరియస్ అయ్యారు.

Arjun : కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ డైరెక్టర్‌గా యాక్షన్ కింగ్.. హీరోగా విశ్వక్ సేన్..

 

ఇక రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆర్జీవీ స్పందిస్తూ.. ”కొండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రేవంత్ రెడ్డిని రానియ్యకుండా చేయడానికి, ఇది కొండా ఫ్యామిలీ యొక్క ప్రత్యర్థుల కుట్ర కాకపోతే ,ఈ అరెస్ట్ కి ఇంకేం కారణం?” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.