Konda On New Party : తెలంగాణలో కొత్త పార్టీ..? కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ నాయకత్వం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు.

Konda On New Party : తెలంగాణలో కొత్త పార్టీ..? కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Konda

Konda On New Party : పార్టీ మార్పుపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. అంతేకాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందన్న కొండా.. గట్టిగా పోరాడే పార్టీలో చేరుతానని ప్రకటించారు.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ కుటుంబ పాలనపై బలంగా కొట్లాడుతున్నాయని చెప్పారు. కానీ, ఆ పార్టీల ఢిల్లీ నాయకత్వం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిది, నాది ఒకే లక్ష్యం అన్నారు. అదే సమయంలో ఆయన మరో బాంబు పేల్చారు. చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ వీడతారని అన్నారు.

Rahul Gandhi : టీఆర్ఎస్‌తో పోరాటమే, పొత్తులుండవు-రాహుల్ గాంధీ

కాగా, గత రెండు రోజులుగా వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి.. రాజకీయంగా హల్ చల్ చేస్తున్నారు. మహా పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

కొండా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నడుస్తుండగా కొండా కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి

కాగా, టీఆర్ఎస్‌లో చేరి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చిన ఆయన కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయారు. ఏ రాజకీయ పార్టీలో చేరనప్పటికీ.. రాజకీయంగా తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌కు బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తన పొలిటికల్ కెరియర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి కొండా.. ఏ పార్టీలో చేరతారో అధికారికంగా క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.