క్రీడాకారులకు, ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆట మళ్లీ మొదలైంది

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 04:54 AM IST
క్రీడాకారులకు, ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆట మళ్లీ మొదలైంది

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ టోర్నీలు అన్ని వాయిదా వేయడమో, పూర్తిగా రద్దు చేయడమో జరిగింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ నిర్వహణపైనా కరోనా వైరస్ ఎఫెక్ట్ చూపింది. ఇక మన దేశంలో చాలా పాపులర్ అయిన ఐపీఎల్ సైతం వాయిదా పడింది. ఇలా ప్రపంచం ఏదైనా, క్రీడ ఏదైనా కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. దీంతో అటు క్రీడాకారులు, ఇటు క్రీడాభిమానులు బాగా నిరుత్సాహానికి గురయ్యారు. ఆట ఆడే అవకాశం లేక ప్లేయర్లు, ఆట చూసి ఎంజాయ్ చేసే అవకాశం లేక అభిమానులు డీలా పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్. ఆట మళ్లీ మొదలైంది. ఓ లీగ్ ఆరంభమైంది. 

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకున్న వేళ దక్షిణ కొరియాలో బేస్ బాల్ లీగ్ షురూ అయింది. కరోనా మహమ్మారితో ఆటలన్నీ బంద్ అయ్యాక తిరిగి ఆరంభమైన తొలి ప్రధాన ప్రొఫెషనల్ లీగ్ ఇదే కావడం విశేషం. మంగళవారం(మే 5,2020) మైదానంలో చీర్ గల్స్ చిందులు కనిపించాయి. ఆటగాళ్ల కేకలు వినిపించాయి. కాకపోతే కనిపించనిదంతా అభిమానుల కోలాహలం మాత్రమే. అయితే ఆ లోటు కూడా లేకుండా ఉండేందుకు ప్రేక్షకుల చిత్రాలను స్టేడియంలో ఏర్పాటు చేశారు. క్రీడాకారులు కరోనా బారిన పడకుండా సురక్షితమైన వాతావరణంలో నిర్వాహకులు మ్యాచ్ ను నిర్వహించారు. ముందు జాగ్రత్తగా ప్లేయర్లు అందరూ మాస్కులు తొడుక్కున్నారు. 

చీర్ గర్ల్స్ చిందులు, ప్లేయర్ల కేకలు:
కేబీవో లీగ్ ఈ సీజన్ ను ప్రారంభం చేసింది. SK Wyverns, Hanwha Eagles మధ్య తొలి మ్యాచ్ జరిగింది. తొలుత ప్రేక్షకులు లేకుండానే లీగ్ స్టార్ట్ చేస్తాని కొరియా బేస్ బాల్ ఆర్గనైజేషన్ తెలిపింది. క్రమంలో ప్రేక్షకులను స్టేడియానికి ఆహ్వానిస్తామంది. అది కూడా కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని. లీగ్ స్టార్ట్ అవడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందన్నారు. స్టేడియం నుంచి చీర్ గర్ల్స్ చేసిన శబ్దాలు వినిపించాయన్నారు. ఇక ఈ లీగ్ టీవీలో లైవ్ లో ప్రసారం చేశారు. ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని గేమ్ ని చూసి ఎంజాయ్ చేయలేకపోయిన అభిమానులు టీవీలో లైవ్ లో చూసి ఆనందించారు.

కంట్రోల్ లోకి వచ్చిన కరోనా:
దక్షిణ కొరియాలో 10వేల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 250మంది కరోనాతో చనిపోయారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కరోనా మహమ్మారి నియంత్రించడంలో సక్సెస్ అయ్యింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు, ప్రభుత్వం రిలాక్స్ అయ్యాయి. మెల్లగా అన్ని రకాల కార్యకలాపాలు స్టార్ట్ చేస్తోంది ప్రభుత్వం. త్వరలోనే స్కూల్స్ రీఓపెన్ చేసే పనిలో ప్రభుత్వం ఉంది.

Also Read | కరోనా ఎఫెక్ట్, ఇకపై బాల్ టాంపరింగ్ చట్టబద్ధం