Koti Womens College: కోఠి ఉమెన్స్ కాలేజ్.. ఇక నుంచి తెలంగాణ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం..

ఓయూకు అనుబంధంగా 98 సంవత్సరాలు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ 2022-13 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ మహిళా యూనివర్శిటీ(టీఎంయూ)గా మారనుంది. దీంతో తెలంగాణకు కూడా మహిళా యూనివర్శిటీ వచ్చినట్లయింది. హైదరాబాద్ కోఠిలోని ఉమెన్స్ కాలేజీని యూనివర్శిటీగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు ఇదివరకే...

Koti Womens College: కోఠి ఉమెన్స్ కాలేజ్.. ఇక నుంచి తెలంగాణ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం..

Telangana Women's University

Koti Womens College: ఓయూకు అనుబంధంగా 98 సంవత్సరాలు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ 2022-13 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ మహిళా యూనివర్శిటీ(టీఎంయూ)గా మారనుంది. దీంతో తెలంగాణకు కూడా మహిళా యూనివర్శిటీ వచ్చినట్లయింది. హైదరాబాద్ కోఠిలోని ఉమెన్స్ కాలేజీని యూనివర్శిటీగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. ఆ మాటను నిలబెట్టుకుంటూ కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పబ్లిక్ గార్డెన్స్‌లో కేసీఆర్.. ఢిల్లీలో అమిత్ షా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ మహిళా యూనివర్శిటీగా కొనసాగింది. రెండు రాష్ట్రాల విభజన అనంతరం తిరుపతిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయం ఏపీకి పరిమితం అయింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంకు తెలంగాణ మహిళా యూనివర్శిటీ లేకుండా పోయింది. ఈ నేఫథ్యంలో కోఠిలోని ఉమెన్స్ కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్పుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. విజ్ఞలత తెలిపారు. యూనివర్శిటీగా మారడంతో పాలన వ్యవహారాలు బదిలీ కానున్నాయి. కోఠి మహిళా కాలేజీలో కొనసాగుతున్న బోధన, బోధనేతర సిబ్బంది ఓయూకు వచ్చేందుకు వీలుగా ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Amit Shah: సినిమా చూసి భార్యను ఆటపట్టించిన అమిత్ షా

ఇదిలాఉంటే.. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీసీని నియమించాల్సి ఉంది. వీసీని నియమించనందున యూనివర్శిటీలో చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక మహిళా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీ సంఖ్య, కోర్సుల వివరాలు ఇతవరకు ప్రకటించలేదు. ఓయూ నిర్వహించే టీఎస్‌సీపీజీఈటీ ద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. టీఎస్‌సీపీజీఈటీ–2022 పీజీ అడ్మిషన్ల జాబితాలో తెలంగాణ మహిళా వర్సిటీని కూడా చేర్చారు. కానీ మహిళా వర్సిటీ నుంచి వివరాలు రానందున జూన్‌ 1న విడుదల కావాల్సిన టీఎస్‌ సీపీజీఈటీ–2022 నోటిఫికేషన్‌ నిలిచిపోయింది.