Bangarraju : నేను ఫస్ట్ డ్యాన్స్ చేసింది ఈ పాటకే : కృతిశెట్టి

కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలోని ‘బంగారా’ పాట నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ కే నేను ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాను. ఈ పాట మీకు నాలోని డ్యాన్సర్‌ ను పరిచయం చేస్తుంది.

Bangarraju : నేను ఫస్ట్ డ్యాన్స్ చేసింది ఈ పాటకే : కృతిశెట్టి

Krithishetty

Krithi shetty :  ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో తన ‘బంగార్రాజు’ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు నాగార్జున. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్ర యూనిట్. ఇందులో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. తాజాగా నిన్న ఆదివారం రాత్రి ‘బంగార్రాజు’ మ్యూజికల్ నైట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలోని ‘బంగారా’ పాట నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ కే నేను ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాను. ఈ పాట మీకు నాలోని డ్యాన్సర్‌ ను పరిచయం చేస్తుంది. మధుప్రియ గారు ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు. అలాగే భాస్కరభట్లగారు పాటని మంచి క్యాచీగా రాశారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం చాలా బాగుంది. నా ఫస్ట్ డ్యాన్స్ సాంగ్ కి మంచి సంగీతం అందించినందుకు అనూప్ గారికి థ్యాంక్స్. చైతో వర్క్ చేయడం చాలా బాగుంది. నాగార్జున, రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటులతో నటించడం నా అదృష్టం. నాకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు నాగ్ సర్, డైరెక్టర్ కల్యాణ్‌ కృష్ణ సర్ కి థాంక్స్” అని చెప్పింది.

Shobana : సీనియర్ నటి శోభనకి ఒమిక్రాన్..

కృతి చెప్పినట్లు ఈ పాటలో డ్యాన్స్ బాగా వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కృతి రెండు సినిమాల్లోనూ డ్యాన్స్ ని ప్రదర్శించే సాంగ్స్ రాలేదు. ఇటీవలే ‘బంగారా’ సాంగ్ లిరికల్ ని విడుదల చేశారు. ఇందులో కొన్ని డ్యాన్స్ వీడియో బైట్స్ యాడ్ చేశారు. ఇవి చూస్తేనే అర్థమైపోతుంది కృతిశెట్టి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. ఇక ఫుల్ వీడియో సాంగ్ లో కృతి డ్యాన్స్ అదరగొట్టేస్తుందని తెలిసిపోతుంది. కృతి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.