Krithi Shetty : రొమాంటిక్‌ సీన్స్‌లో నటించేవారిని చులకనగా చూస్తారు.. నాకు రొమాంటిక్, యాక్షన్ రెండూ ఒకటే..

గతంలోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ లతో రెచ్చిపోయింది కృతి శెట్టి. ఇకముందు కూడా చేస్తా అంటుంది. కృతి శెట్టి మాట్లాడుతూ........

Krithi Shetty : రొమాంటిక్‌ సీన్స్‌లో నటించేవారిని చులకనగా చూస్తారు.. నాకు రొమాంటిక్, యాక్షన్ రెండూ ఒకటే..

Krithi Shetty

Krithi Shetty :  ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టింది కృతి శెట్టి. మొదటి సినిమా హిట్ అవ్వడంతోనే చాలా ఆఫర్లు కృతి తలుపు తట్టాయి. రొమాంటిక్ సీన్స్ కి కూడా ఓకే చెప్తుండటంతో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి బేబమ్మకి. ఉప్పెన,శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది కృతి. తాజాగా ది వారియర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా కృతి శెట్టి రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడింది.

Mahesh Babu : ఏజెంట్ టీజర్ పై సూపర్ స్టార్ ప్రశంసలు.. థాంక్యూ బ్రదర్ అంటూ అఖిల్ రిప్లై..

గతంలోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ లతో రెచ్చిపోయింది కృతి శెట్టి. ఇకముందు కూడా చేస్తా అంటుంది. కృతి శెట్టి మాట్లాడుతూ.. ”చాలా మంది రొమాంటిక్ సీన్స్ లో నటించేవారిని చులకనగా చూస్తారు. కానీ హీరో, హీరోయిన్స్ మధ్య బంధాన్ని చూపించాలంటే రొమాంటిక్ సీన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. కథలో అలాంటి రొమాంటిక్ సీన్స్ అవసరం అనుకుంటే లిప్‌లాక్‌లు, బోల్డ్‌సీన్స్‌ కి ఓకే చెప్తాను. అదంతా నటనలో భాగంగానే భావిస్తాను. యాక్షన్‌ సీన్లు ఎంతో, బోల్డ్‌ సీన్లూ అంతే. వాటిని వేరేగా చూడను” అని తెలిపింది. దీంతో భవిష్యత్తులో కూడా మరిన్ని రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ లో నటిస్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది కృతి శెట్టి.