KTR Covid Vaccine : మీకు రూ.150, మాకు రూ.నాలుగు వందలా? కరోనా వ్యాక్సిన్ ధరపై కేటీఆర్ ఆగ్రహం

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రాష్ట్రాలకు 400 రూపాయలకు ఇచ్చే విధంగా వ్యాక్సిన్ పాలసీని ప్రకటించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

KTR Covid Vaccine : మీకు రూ.150, మాకు రూ.నాలుగు వందలా? కరోనా వ్యాక్సిన్ ధరపై కేటీఆర్ ఆగ్రహం

Ktr Covid Vaccine

KTR Covid Vaccine Price : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రాష్ట్రాలకు 400 రూపాయలకు ఇచ్చే విధంగా వ్యాక్సిన్ పాలసీని ప్రకటించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

జీఎస్టీ పన్నుల వసూళ్ల విషయంలో వన్ నేషన్-వన్ ట్యాక్స్ పాలసీ అమల్లో ఉన్నప్పుడు.. వ్యాక్సిన్ ధర విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా నిధులను సమకూర్చి దేశవ్యాప్తంగా ఉధృతంగా టీకా కార్యక్రమం జరిగేలా కేంద్రం చర్యలు చేపట్టవచ్చు కదా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వ్యాక్సిన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని జోడించారు.

ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని కొవిషీల్డ్ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇన్ స్టిట్యూట్ ప్రకటన చేసింది. ఉత్పత్తిదారుల నుంచి నేరుగా రాష్ట్రాలు టీకాలను తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇకపై రాష్ట్రాలు నిర్ణీత ధరలకు వ్యాక్సిన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందించాలంటే కచ్చితంగా రాష్ట్రాలకు అందుకు సరిపడ టీకాలను కొనుగోలు చేయాల్సిందే. ధరల విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తేడాలు ఉండటం ఇప్పుడు చర్చకు దారితీసింది.