KTR: కేటీఆర్ సర్..! మీరు ఈ ‘ఓటీటీ‘ షోలు చూడండి.. నెటిజన్ల సలహా..

మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. వైద్యులు చికిత్స నిర్వహించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. పనిలోపనిగా ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్ కు అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఓటీటీ వెబ్ సిరీస్ ల పేర్లను చెబుతున్నారు.

KTR: కేటీఆర్ సర్..! మీరు ఈ ‘ఓటీటీ‘ షోలు చూడండి.. నెటిజన్ల సలహా..

KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) శనివారం ఉదయం ప్రగతిభవన్ లో కిందపడ్డారు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైంది. వైద్యులు పరీక్షించి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద ప‌డిపోయాను. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో విలువైన‌ ఓటీటీ షోలు చూడ‌టానికి స‌ల‌హా ఇస్తారా? అంటూ కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Minister KTR Leg Fracture : మంత్రి కేటీఆర్ కాలికి గాయం-మూడు వారాలు విశ్రాంతి

కేటీఆర్ ట్వీట్ కు అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఓటీటీ వెబ్ సిరీస్ ల పేర్లను చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కేటీఆర్ ట్విటర్ ను ఫాలో అయ్యేవారు తమ సలహాలను ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రయన్.. వైల్డ్ వైల్డ్ కంట్రీ, స్కామ్ 1992 సిరీస్ లు చూడాలంటూ సూచించారు.

అదేవిధంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఓ నెటిజన్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ ను వీక్షించండి అంటూ సలహా ఇచ్చాడు. మాస్, కింగ్ డం సీజన్ -1, 2 కొరియన్ సిరీస్ ల ను వీక్షించండి కేటీఆర్ సర్ అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ఇలా అనేక మంది నెటిజన్లు తమకు నచ్చిన సిరీస్ పేర్లను చెబుతూ వీటిని చూడండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. తన అధికారిక ఖాతా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను, తన ప్రోగ్రాంలకు సంబంధించిన కార్యక్రమాలను తెలుపుతుంటారు.