KTR-Revanth: రేవంత్‌పై రూ.కోటి పరువు నష్టం దావా.. కోర్టుకు ఆధారాలు సమర్పణ

తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధిత వ్యక్తులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని... సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ వాటిని తొలగించాలని కోర్టును కోరారు కేటీఆర్.

KTR-Revanth: రేవంత్‌పై రూ.కోటి పరువు నష్టం దావా.. కోర్టుకు ఆధారాలు సమర్పణ

Ktr Revanth Reddy Defamation Case

KTR-Revanth : తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ … ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై లీగల్ ఫైట్ చేస్తున్నారు. నిన్న(సెప్టెంబర్ 20 సోమవారం, 2021) కోర్టు ప్రాసెస్ మొదలుపెట్టానని చెప్పిన కేటీఆర్… హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా, ఇంజక్షన్ పిటిషన్ వేశారు.

KTR, Revanth Reddy Twitter War : కేటీఆర్-రేవంత్ ల మధ్య ట్విట్టర్ వార్ ఎటు దారి తీస్తుంది

కోర్టులో వేసిన పిటిషన్ కు ఇవాళ మరిన్ని ఆధారాలు సమర్పించారు మంత్రి తారక రామారావు. మొత్తం కోటి రూపాయల పరువునష్టానికి దావా వేశారు. దాంతో పాటు… రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారనడానికి అవసరమైన వీడియో బైట్లు, వెబ్ సైట్ పోస్టులు, ఆర్టికల్స్ కు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా తనకు ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి గుర్తింపు ఉందని.. ఐతే… వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను దెబ్బతీసేలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని KTR కోర్టుకు తెలిపారు. సంబంధం లేని అంశాలను తనకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని.. దీనిని వెంటనే నియంత్రించాలని ఆయన కోర్టును విన్నవించారు.

KTR-Revanth : రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధిత వ్యక్తులు(రేవంత్ రెడ్డి) చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని… సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ వాటిని తొలగించాలని కోర్టును కోరారు కేటీఆర్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని మంత్రి విన్నవించారు. జరిగిన పరువునష్టానికి ఆర్థికంగా పరిహారం చెల్లించేలా చూడాలని కోరారు.